AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Rashmika Marriage: హైదరాబాద్‌లో అడుగు పెట్టిన విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం.. వీడియో ఇదిగో

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్లిపీటలెక్కిన విజయ్ - రష్మిక దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుతో వచ్చిన ఈ కొత్త దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Vijay Rashmika Marriage: హైదరాబాద్‌లో అడుగు పెట్టిన విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం.. వీడియో ఇదిగో
Vijay And Rashmika
Basha Shek
|

Updated on: Feb 27, 2026 | 8:04 PM

Share

టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత ఈ కొత్త దంపతులు శుక్రవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఈ నవ దంపతులకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా గురువారం (ఫిబ్రవరి 26)న విజయ్- రష్మిక మందన్నాల వివాహం అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. అలాగే పలువరు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

కాగా పెళ్లి తంతు పూర్తయిన తర్వాత స్వయంగా విజయ్- రష్మికలే తమ పెళ్లి వేడుకలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఈ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా మార్చ్ 04న విజయ్‌- రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ ను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విజయ- రష్మికల రిసెప్షన్ కు హాజరుకానున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా..

అంతకు ముందు ప్రధాని మోడీతో..

పెళ్లి తర్వాత ఇలా ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ చేరుకున్న విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం..వీడియో
హైదరాబాద్‌ చేరుకున్న విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం..వీడియో
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు