16 ఏళ్ల సినీ ప్రయాణం.. సమంత ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

25 February 2026

భారతీయ సినిమా ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే.

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న సామ్.. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. నేటికి ఆమె సినీ ప్రయాణానికి 16 సంవత్సరాలు

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం నటిగానే కాకుండా అటు నిర్మాతగానూ దూసుకుపోతుంది.

 ఇటీవలే దర్శకుడు రాజ్ నిడమోరుతో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ఇదిలా ఉంటే నివేదికల ప్రకారం సమంత ఆస్తులు 2025 నాటికి రూ.110 కోట్లకు పైగానే ఉంటుందట.

ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 కోట్లు వసూలు చేస్తుంది. సినిమాలతోపాటు బ్రాండ్ ప్రమోషన్స్, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ ద్వారా భారీగానే సంపాదిస్తుంది సామ్.

సమంత ఎండార్స్‌మెంట్ల ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 8 కోట్లు సంపాదిస్తుంది. హైదరాబాద్‌లో రూ.7.8 కోట్ల విలువైన అద్భుతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. 

 సమంతా రూత్ ప్రభు సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే తన పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. సమంతా రూత్ ప్రభుకి లగ్జరీ కార్లంటే ఉన్న ప్రేమ కూడా అందరికీ తెలిసిందే.

ఆమె వద్ద ఆడి Q7 (రూ. 89.90 లక్షలు), పోర్స్చే కేమన్ GTS (రూ. 1.46 కోట్లు), ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (రూ. 2.26 కోట్లు) ఉన్నాయి.  మెర్సిడెస్-బెంజ్ G63 AMG ఉంది.