30 ఏళ్లు దాటాకే మ్యారేజ్ అంటున్న యంగ్ హీరోలు.. 

Rajeev 

26  February 2026

యువ హీరోలు చాలా మంది ముప్పైలలో స్థిరపడ్డాక పెళ్లికి మొగ్గు చూపారు. నాగ చైతన్య 38 ఏళ్ల వయసులో శోభితను వివాహం చేసుకున్నాడు. 

అలాగే మెగా హీరో హీరో వరుణ్ తేజ్ 33 ఏళ్ల వయసులో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒకటయ్యారు. ఇటీవలే వీరికి కొడుకుపుట్టాడు

 రానా దగ్గుబాటి 35 ఏళ్ల వయసులో మిహీకతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు.

హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు.

మరో యంగ్ హీరో  శర్వానంద్ కూడా 30 తర్వాతే పెళ్లి చేసుకున్నాడు. తన 38వ ఏట రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు.

హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ రష్మికను విజయ్ వివాహం చేసుకున్నాడు.