AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..! వెంటనే తగ్గించండి

మహిళల ఆరోగ్యంలో గర్భాశయం కీలక పాత్ర పోషిస్తుంది. దాని ఆరోగ్యం మన ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, రెడ్ మీట్ వంటివి గర్భాశయాన్ని బలహీనపరుస్తాయి, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ఈ కథనం గర్భాశయానికి హాని కలిగించే ఆహారాలతో పాటు, దానిని బలంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని వివరిస్తుంది. సరైన ఆహారంతో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..! వెంటనే తగ్గించండి
Uterus Health
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2026 | 8:05 PM

Share

మహిళల ఆరోగ్యంలో గర్భాశయం కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ సమతుల్యత, నెలసరి చక్రం, గర్భధారణ వంటి అంశాలు గర్భాశయ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని ఆహార అలవాట్లు గర్భాశయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఎలాంటి ఆహారాలు గర్భాశయాన్ని బలహీనపరుస్తాయో ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహారాలు గర్భాశయానికి హాని కలిగిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ అమృతమోఫీషియల్ అలాంటి ఆహారాల గురించి సమాచారాన్ని అందిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం…

1. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్: ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉన్న ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి.

2. అధిక చక్కెర: ఎక్కువగా చక్కెర తీసుకోవడం ఇన్‌ఫ్లమేషన్ పెంచి పీసీఓడీ వంటి సమస్యలకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

3. కార్బొనేటెడ్ డ్రింక్స్: సోడాలు, కోల్డ్ డ్రింక్స్‌లో ఉన్న అధిక చక్కెర మరియు కెమికల్స్ హార్మోన్ స్థాయిలపై ప్రభావం చూపవచ్చు.

4. అధిక రెడ్ మీట్: ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోవడం శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచి గర్భాశయ సమస్యలకు దారి తీస్తుంది.

5. అధిక కాఫీన్: రోజుకు ఎక్కువ కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం హార్మోన్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు.

6. రిఫైన్డ్ కార్బ్స్: వైట్ బ్రెడ్, మైదా పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచి హార్మోన్లపై ప్రభావం చూపుతాయి.

7. పులియబెట్టిన ఆహారాలు: రాత్రిపూట ఇడ్లీ, దోసె, బ్రెడ్ లేదా వెనిగర్ ఆధారిత ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల గర్భాశయ పనితీరు మందగిస్తుంది. దీని వలన పొత్తికడుపులో బరువు పెరిగి తెల్లటి స్రావాలు స్రవిస్తాయి.

8. మిగిలిపోయిన ఆహారాలు: 24 గంటల కంటే ఎక్కువ కాలం బయట ఉంచిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. ఇది గర్భాశయానికి తగినంత పోషకాలు అందకుండా చేస్తుంది. దీంతో ఋతు సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది.

గర్భాశయాన్ని బలంగా ఉంచుకోవడానికి మహిళలు సమతుల్య ఆహారం, ఆకు పచ్చ కూరగాయలు, తాజా పండ్లు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు, అవిసె గింజలు, చియా గింజలు, ఓట్స్, పెరుగు, పసుపు వంటివి తినాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ చేరుకున్న విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం..వీడియో
హైదరాబాద్‌ చేరుకున్న విజయ్‌-రష్మిక.. అభిమానుల ఘన స్వాగతం..వీడియో
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు