Spirit Movie : స్పిరిట్ పోస్టర్లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ? నెట్టింట ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. యానిమల్ సినిమాతో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవలే రాజా సాబ్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఓవైపు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా స్పిరిట్ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుంది. ఇదివరకే వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న నటుడు వివేక్ ఒబెరాయ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్న ప్రభాస్ పాత్రకు ధీటుగా నిలబడే పవర్ ఫుల్ విలన్ పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ ఇంతకముందెన్నడూ చూడని లుక్ లో మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఆయనతోపాటు పోస్టర్ లో మరో అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఆమె గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
వివేక్ ఒబెరాయ్ పోస్టర్ లో కనిపిస్తున్న ఆ పవర్ ఫుల్ భామ పేరు ఐశ్వర్య దేశాయ్. ఆమె ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్. విమర్శకుల ప్రశంసలు పొందిన గల్లీ బాయ్, షార్ట్ ఫిల్మ్ రాట్ ఇన్ ది కిచెన్ చిత్రాలతో ఆమె పాపులర్ అయ్యింది. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఆమె మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి మార్కెటింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. స్పిరిట్ సినిమాలో ఇప్పటికే స్టార్-స్టడెడ్ తారాగణం ఉండగా , ఐశ్వర్య దేశాయ్ ఎంట్రీ కొత్త ఆసక్తిని కలిగిస్తుంది. కేవలం ఒక్క పోస్టర్ తోనే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
