Priyanka Chopra: ప్రియాంక చోప్రా ప్రాజెక్టుతో వార్తల్లో ఫ్లాష్ అవుతున్న సమంత
ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సీజన్ 2 మే 6న వస్తుంది. దీని విడుదల సమంత ఇండియన్ సిటాడెల్‌పై చర్చకు దారితీసింది. ప్రియాంక గ్లోబల్ హిట్ సాధించాక, సమంత సీక్వెల్ చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేకర్స్, సమంత నిర్ణయాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ వల్ల ఇన్‌డైరెక్ట్ బెనిఫిట్స్ గురించి కూడా విశ్లేషణ.
ప్రియాంక చోప్రా యాక్ట్ చేసిన సిటాడెల్ రిలీజ్ డేట్ ఇలా వచ్చిందో లేదో.. ఆమెతో లింకున్న విషయాలన్నీ పాపప్ అవుతున్నాయి. అందులో డైరక్ట్ గా లింక్ ఉన్న ప్రాజెక్టులేంటో, ఇన్ డైరక్ట్ గా బెనిఫిట్ ఉన్న వ్యక్తులెవరో స్పెషల్‌గా చెప్పాల్సిందేనంటారా? ఇంకెందుకు ఆలస్యం.. వచ్చేయండి చూసేద్దాం. డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా మొన్న మొన్నటి దాకా మనకు పెద్దగా టచ్ లేని నటి కావచ్చేమోగానీ, ఇప్పుడు మన సూపర్ డూపర్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. వారణాసి సినిమా షూట్‌కి సంబంధించి ఆమె ఇచ్చినన్ని లీక్స్ ఇంకెవరూ ఇవ్వకపోవడంతో తెలుగు వారికందరికీ డార్లింగ్ బ్యూటీ అయ్యారు ప్రియాంక. అందుకే ఆమె సిటాడెల్ సీజన్ 2 రిలీజ్ డేట్ రాగానే ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు జనాలు. సిటాడెల్ ఫస్ట్ పార్టులో మెప్పించారు పీసీ. ఈ స్పై థ్రిల్లర్ సీరీస్ సీజన్2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది మే 6 నుంచి సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మానవాళిని రక్షించేందుకు… మరింత మంది ఏజెంట్లను కలుపుకుని నదియా, మేసన్ చేసే సాహసాలతో సెకండ్ సీజన్ సిద్ధమైంది. ఈ న్యూస్ అలా ఫ్లాష్ కాగానే, అందరికీ సమంత సిటాడెల్ గుర్తుకొస్తోంది. ఇప్పుడు సిటాడెల్ సీజన్ 2ని సామ్ కూడా చేస్తారా? అనే టాక్స్ నడుస్తున్నాయి. పీసీ ఎలాగూ ఫేమస్ అయ్యారు కాబట్టి, దాన్ని మళ్లీ ఇక్కడ రీమేక్ చేయాలా? వద్దా? అని మేకర్స్ ఆలోచనలో పడతారేమోననే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా మా ఇంటి బంగారంతో బిజీగా ఉన్న సామ్ సిటాడెల్ సీక్వెల్ గురించి ఏం చెప్తారో వినాలనే ఎదురుచూపులు మాత్రం ఎక్కువయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

