ఆధార్ నెంబర్ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??
ఆధార్‌తో బ్యాంకు ఖాతా నుండి డబ్బు తీయాలంటే వేలిముద్ర, ఐరిస్ లేదా ఓటీపీ తప్పనిసరి అని UIDAI స్పష్టం చేసింది. కేవలం ఆధార్ నంబర్‌తో డబ్బు డ్రా చేయడం అసాధ్యం. అయితే, AEPS ద్వారా జరిగే మోసాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వేలిముద్రలను చోరీ చేసి AEPS లావాదేవీల ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. m-Aadhaar యాప్ ద్వారా మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయడం సురక్షితం.
ఆధార్ కార్డు.. ముఖ్య గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఎకౌంట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీదానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్ భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయి. కేవలం మన ఆధార్ నంబర్ తెలిస్తే చాలు, ఎవరైనా మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయగలరా? ఈ డౌట్ చాలామందిలో ఉంది. ఈ విషయంపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. కేవలం ఆధార్ నంబర్ లేదా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరూ డబ్బులు తీయలేరని తెలిపింది. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయడానికి సంతకం, డెబిట్ కార్డు, పిన్, ఓటీపీ ఎలా అవసరమో అలాగే ఆధార్ ద్వారా డబ్బులు తీయాలంటే మన వేలిముద్ర, కంటిపాప ఐరిస్ స్కాన్ లేదా ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ తప్పనిసరి. అయితే, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ AEPS ద్వారా మోసాలు జరుగుతున్నాయనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆధార్ నంబర్‌తో పాటు మన వేలిముద్రలను కూడా సంపాదిస్తే, మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా మన వేలిముద్రలను చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలపై ఉండే వేలిముద్రలను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటిని సిలికాన్ లేదా జెల్‌పై కాపీ చేసి, మైక్రో-ఏటీఎం పరికరాల ద్వారా AEPS లావాదేవీలు జరుపుతున్నారు. ఈ మోసంలో మన మొబైల్‌కు ఎలాంటి ఓటీపీ రాదు. నేరుగా ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు మాత్రమే మెసేజ్ వస్తుంది. ఆధార్ దుర్వినియోగం కాకుండా ఎం-ఆధార్ యాప్ ద్వారా మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయవచ్చు. ఇలా చేస్తే, మీరు అన్‌లాక్ చేసేంత వరకు మీ వేలిముద్ర లేదా ఐరిస్‌ను ఎవరూ, ఎక్కడా ఉపయోగించలేరు. యూఐడీఏఐ గానీ, బ్యాంకులు గానీ ఓటీపీ లేదా పిన్ వివరాల కోసం ఎప్పుడూ ఫోన్ చేయవు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త. ఆస్తి పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అనవసరంగా ఎవరికీ ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ నంబర్‌ను మాస్క్ చేసి ఇవ్వడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం
Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..
మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

