Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..
శర్వానంద్ నటించిన 'బైకర్' సినిమా థియేటర్లలో సాలిడ్ హిట్ కొట్టి, మంచి వసూళ్లు రాబట్టింది. రాజశేఖర్, మాళవిక నాయర్‌లతో కూడిన ఈ మోటోక్రాస్ స్పోర్ట్స్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అక్కినేని నాగార్జున, పీవీ సింధు వంటి ప్రముఖులు సైతం ప్రశంసించారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 1 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'బైకర్' అందుబాటులోకి రానుంది.
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి నారీనారీ నడుమ మురారి… సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. దీని తర్వాత బైకర్ అంటూ ఓ స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ హీరో తండ్రిగా ఓ కీలక పాత్రలో కనిపించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా యూవీ క్రియేషన్స్, బైకర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బైకర్ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. హిట్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. శర్వానంద్, రాజశేఖర్ ల నటన, తండ్రీ కొడుకుల ఎమోషనల్ సెంటిమెంట్, రేసింగ్ సన్నివేశాలు బైకర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. సామాన్యులే కాదు అక్కినేని నాగార్జున, పీవీ సింధు లాంటి ప్రముఖులు కూడా బైకర్ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పటికీ థియేటర్లలో వసూళ్లను రాబడుతోన్న బైకర్ సినిమా అప్పుడే డిజిట్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని తెలుస్తోంది. బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

