Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం
ప్రముఖ నటి నయనతార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిహార్సల్స్ లేకుండానే తారక్ అద్భుతమైన డ్యాన్స్ చేస్తారని ప్రశంసించారు. అదుర్స్ షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, తన కెరీర్లో చంద్రకళ పాత్ర పొందిన ప్రజాదరణ, సోషల్ మీడియా మీమ్స్‌తో తాను ఆశ్చర్యపోయానని నయనతార వెల్లడించారు.
ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ సామర్థ్యం, సెట్లోని అనుభవాలు, అలాగే తన అదుర్స్ చిత్రంలో చంద్రకళ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభకు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని నయన్ చెప్పుకొచ్చారు. రిహార్సల్స్ లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్నారు. ఆయన డ్యాన్స్‌ను తెరపై చూసి తాను ఆశ్చర్యపోయానంటూ చెప్పుకొచ్చారు నయన్. అలా ఎన్టీఆర్ ఒక్కరు మాత్రమే చేస్తారని.. తాను చూసిన ఏకైక హీరో కూడా తనే అని.. నయన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ సెట్లో చాలా సరదాగా ఉంటారని, అదుర్స్ టైంలో తారక్ తో ఓ సంఘటనను నయన్ గుర్తు చేసుకున్నారు. ఒకరోజు తాను టచ్-అప్ చేసుకుంటుంటే.. ఎన్టీఆర్ తనను నిశితంగా చూసి… ఎవరూ నిన్ను చూడరు..అందరూ నన్నే చూస్తారు.. ఎందుకంత టచప్ అని ఫన్నీగా చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు నయన్. ఎన్టీఆర్ ఎలాంటి కదలికలైనా అలవోకగా చేస్తారని, డ్యాన్సర్లు చేసిన దానికంటే చాలా అద్భుతంగా చేస్తారని ఆమె ప్రశంసించారు. అలాంటి తారక్ చేత.. రాజమౌళి నాటు నాటు పాట కోసం.. హుక్ స్టెప్‌ను చాలా సార్లు చేయించారంటూ.. చివర్లో నవ్వుతూ కోట్ చేశారు నయన్. నయనతార తన కెరీర్లో చేసిన అదుర్స్ సినిమాలో చంద్రకళ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ పాత్రకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, మీమ్స్ ఉన్నాయని ఆమె తెలిపారు. సినిమాలో బ్రహ్మానందం పాత్రతో చంద్రకళకు సంబంధించిన మీమ్స్‌ను ఆమె చూసి ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..
మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

