AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఏడాదిగా యూట్యూబ్ సెన్సేషన్ ఈ పాట. అటు సోషల్ మీడియాలో విపరీతమైన రీల్స్. కంచు కంఠంతో తెలంగాణ జానపద గాయని మల్లమ్మ పాడిన ఈ ఫోక్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదలైన ఏడాది గడుస్తున్నా ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ నెట్టింట సంచలనం సృష్తిస్తుంది. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా..?

Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 6:56 PM

Share

ఇటీవల తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఊర్రుతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు యూట్యూబ్.. మరోవైపు సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న, పెద్ద అందరూ ఈ పాటలకు మాస్ స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. నిత్యం ఒకదాని తర్వాత మరో జానపద పాట విడుదలవుతూనే ఉంది. ఒక్కో పాటకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి అంటే ఏ రేంజ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ వైరలవుతున్నాయో చెప్పక్కర్లేదు. రాను బొంబాయికి రాను, బాయిలోనా బల్లిపలికే, ఓ పిలగా వెంకటి, పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. కానీ మీకు ఈ పాట గుర్తుందా.. ? దాదాపు 300 మిలియన్ వ్యూస్ అందుకుని ఇప్పటికీ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. గతేడాది విడుదలైనప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఆ పాటలో ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటించింది. ఎప్పటిలాగే తన అందమైన డ్యాన్స్, మాస్ స్టెప్పులతో కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇంతకీ ఆ పాట ఏంటా అని చూస్తున్నారా.. ? అదేనండి.. “ఎర్ర ఎర్ర రుమాల్ గట్టి.. “ఈ పాట గుర్తుందా.. ? గతేడాది విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అప్పట్లో ఈ పాటకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ విన్నా.. ఏ వేడుకలో అయినా ఈ సాంగ్ మారుమోగిపోయింది. ఇప్పటివరకు ఎన్ని ఫోక్ సాంగ్స్ విడుదలైనప్పటికీ ఈ పాటకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఎర్రా ఎర్రా రుమాలు గట్టి ఎర్రా ఎర్రా రుమాలు గట్టి..

యాడికి పోతున్నావ్ బావ ఎర్రా ఎర్రా రుమాలు గట్టి..

నాగమోఖం నలిగేసనం నాగితే పాణం పోతాది బావ..

నాగమోఖం నలిగేసనం..” అంటూ సాగే ఈ పాటను జానపద గాయని మల్లమ్మ పాడింది. అలాగే ఈ పాటకు రాజేందర్ కొండా సాహిత్యం అందించగా.. మదీన్ ఎస్కే సంగీతం అందించారు. ఇందులో ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటించగా.. శేఖర్ కొరియోగ్రఫీ అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర