మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఒక థార్ కారు డ్రైవర్ ఘోరంగా ప్రవర్తించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌తో ఉన్న కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ విధించే క్రమంలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు ముందు నిలబడి నంబర్ ప్లేట్ ఫోటో తీస్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. డ్రైవర్ ఒక్కసారిగా కారును ముందుకు పోనివ్వడంతో, కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయాడు. డ్రైవర్ కారును ఆపకుండా దాదాపు 50 అడుగుల దూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. అనంతరం కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోవడంతో ఆయన చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కారుతో పారిపోయిన డ్రైవర్ కోసం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై దాడికి పాల్పడిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.