AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క పొడి.. వందల ప్రయోజనాలు.. ప్రతి ఒక్కరూ రోజుకో స్పూన్ తినాల్సిందే

 మన తెలుగువారి భోజనంలో మొదటి ముద్దలో కమ్మని కారంపొడి, చెంచాడు ఆవు నెయ్యి వేసుకుని తినడం తరతరాలుగా వస్తున్న ఆరోగ్యకరమైన అలవాటు. సాధారణ కందిపొడి లేదా కరివేపాకు పొడికి భిన్నంగా.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసె గింజలు, కాల్షియం గని అయిన నువ్వులు, ఐరన్ అందించే కరివేపాకు, ప్రోటీన్ ఇచ్చే పల్లీల కలయికతో చేసే ఈ కారం పొడి మహిళల హార్మోన్ల సమతుల్యతకు, జుట్టు ఎదుగుదలకు, కీళ్ల నొప్పుల నివారణకు మరియు కంటి చూపుకు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక్కసారి తయారుచేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచితే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.

Phani CH
|

Updated on: Nov 26, 2026 | 4:14 PM

Share
 కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు – 1 కప్పు నిండుగా, అవిసె గింజలు – 1 కప్పు నిండుగా, వేరుశనగ గింజలు – అర కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు, తాజా కరివేపాకు – 2 కప్పులు నిండుగా, పచ్చిశనగపప్పు – 2 పెద్ద స్పూన్లు, మినప్పప్పు – 2 పెద్ద స్పూన్లు, ధనియాలు – 2 పెద్ద స్పూన్లు, జీలకర్ర – 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 25 (పొట్టు తీసినవి), చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు, కారం పొడి – 2 పెద్ద స్పూన్లు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు, వంట నూనె – 1 స్పూన్ మాత్రమే.

1 / 6
తయారీ విధానం: స్టవ్‌పై అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి లో ఫ్లేమ్‌లో 1 కప్పు నువ్వులు వేసి చిటపటలాడే వరకు 2-3 నిమిషాలు వేయించి ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు అవిసె గింజలు వేసి చిటపటలాడే వరకు దోరగా వేయించి అదే పళ్లెంలోకి తీయాలి. ఆ తర్వాత అర కప్పు పల్లీలను కూడా సిమ్ లో దోరగా వేయించి పళ్లెంలోకి తీసుకోవాలి.

2 / 6
కడాయిలో అర కప్పు సన్నని ఎండు కొబ్బరి ముక్కలు వేసి రంగు మారకుండా ఒక్క నిమిషం పాటు వేయించి విడిగా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల కరివేపాకును వేసి ఆకులు కరకరలాడుతూ పొడిపొడిగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక చిన్న పాన్‌లో 1 స్పూన్ నూనె వేడిచేసి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. అవి సగం వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడి పప్పుల మీద చిన్న నిమ్మకాయంత చింతపండును ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి.

3 / 6
అన్ని దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత.. మిక్సీ జార్‌లో మొదట ఎండు కొబ్బరి ముక్కలు వేసి చిన్న పలుకులు తగిలేలా బరకగా గ్రైండ్ చేసి వెడల్పాటి బేసిన్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, నువ్వులు, అవిసె గింజలను వేసి మరీ నునుపుగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు కరివేపాకు, వేపిన పప్పులు, ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ రాళ్ల ఉప్పు వేసి మెత్తగా పౌడర్ చేసి కలపాలి.

4 / 6
 చివరగా మిక్సీ జార్‌లో వేడికి మగ్గిన చింతపండు, పొట్టు తీసిన 25 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కారం పొడి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ వెల్లుల్లి కారాన్ని గిన్నెలోని పొడులపై వేసి.. గడ్డలు లేకుండా చేత్తో బాగా నలుపుతూ అన్ని పొడులూ సమానంగా కలిసేలా మిక్స్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసా లేదా ఎయిర్-టైట్ జార్‌లో నిల్వ చేసుకోవాలి.

5 / 6
అంతే, నోరూరించే ఆరోగ్యకరమైన 'అవిసె గింజలు-నువ్వుల మల్టీపర్పస్ కారం పొడి' సిద్ధం! వేడివేడి అన్నంలో చెంచాడు నెయ్యితో కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్‌పై చల్లుకుని తిన్నా లేదా ఏదైనా ఫ్రై కూరల్లో చివర్లో ఒక స్పూన్ వేసుకున్నా అద్భుతమైన రుచితో పాటు శరీరానికి సంపూర్ణ పోషకాలను అందిస్తుంది!

6 / 6
Follow Us