AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వామ్మో.. అరివీర భయంకరం.. మనిషికి రెండింతల ఎత్తు.. వీడియో చూస్తే వణుకే..

అనకాపల్లి జిల్లా చీడికాడలో రైతు పొలంలో భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. సుమారు 12 అడుగుల పొడవు, 12 కిలోల బరువున్న గిరినాగును అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. ఇతర పాములనే ప్రధాన ఆహారంగా తీసుకునే గిరినాగులకు గూడు నిర్మించి గుడ్లను పొదిగే ప్రత్యేక లక్షణం కూడా ఉంది.

Andhra: వామ్మో.. అరివీర భయంకరం.. మనిషికి రెండింతల ఎత్తు.. వీడియో చూస్తే వణుకే..
King Cobra
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 3:52 PM

Share

పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుకు ఒక్కసారిగా భారీ గిరినాగు కనిపించింది. అంత పొడవైన పామును సమీపంలో చూసి అతడు భయంతో వణికిపోయాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఎంతో జాగ్రత్తగా పామును పట్టుకుని, తిరిగి అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని చీడికాడలో చోటుచేసుకుంది. చీడికాడలోని ఓ రైతు పొలంలో సుమారు 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించింది. భారీ ఆకారంలో ఉన్న గిరినాగును చూసిన రైతు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. పాము బుసలు కొడుతూ ఉండటంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, తూర్పు వన్యప్రాణుల సంరక్షణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాని బరువు సుమారు 12 కిలోలుగా గుర్తించారు. పామును పట్టుకున్న తర్వాత అటవీశాఖ అధికారుల సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తరలించారు. అక్కడ దానికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా విడిచిపెట్టారు. భారీ గిరినాగు పట్టుబడటంతో రైతుతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు లేదా చంపేందుకు ప్రయత్నించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

గిరినాగులు చాలావరకు ఇతర పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాములు ఇవి. అంతేకాదు.. గుడ్లను పొదిగేందుకు గూడు కట్టే అరుదైన లక్షణం వీటికి ఉంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి తారసపడుతుంటాయి. మనుషుల్ని చూస్తే దాదాపు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. కార్నర్ చేసినా.. బెదిరించే ప్రయత్నం చేసినా తిరగబడతాయి.

Follow Us
తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించిన ఏపీ హోం మంత్రి అనిత
తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించిన ఏపీ హోం మంత్రి అనిత
పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..?
పులి కాదు.. ఒకప్పుడు మన జాతీయ జంతువు ఏంటో తెలుసా..?
చింత చెట్టు నుంచి చప్పుళ్లు.. కోతి అనుకుంటే పొరపాటే.. వామ్మో..
చింత చెట్టు నుంచి చప్పుళ్లు.. కోతి అనుకుంటే పొరపాటే.. వామ్మో..
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే జైలుకే..
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే జైలుకే..
Infinix క్రేజీ డీల్.. ప్రీమియం ఫీచర్స్ స్మార్ట్ టీవీ రూ.9,666కే !
Infinix క్రేజీ డీల్.. ప్రీమియం ఫీచర్స్ స్మార్ట్ టీవీ రూ.9,666కే !
కుల్దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
కుల్దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
చిరంజీవితో ఒక్క సినిమాతో సంచలనం.. కట్ చేస్తే.. తగ్గని గ్లామర్..
చిరంజీవితో ఒక్క సినిమాతో సంచలనం.. కట్ చేస్తే.. తగ్గని గ్లామర్..
చలికాలంలో ఎండు చేపలు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
చలికాలంలో ఎండు చేపలు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్: పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్: పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులు?
రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులు?