తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra: పెట్టిన గుడ్లను పొదిగిన నాటు కోడి.. అందులో ఒక పిల్లని చూడగా ఆశ్చర్యం..
సృష్టిలో అప్పుడప్పుడూ ప్రకృతి ఆశ్చర్యపరిచే దృశ్యాలు చూపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు కాళ్లతో జన్మించిన కోడిపిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.పెడ బూరుగుపుట్టులో చోటుచేసుకున్న ఈ వింత ఘటన చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ...
- Maqdood Husain Khaja
- Updated on: Dec 14, 2025
- 5:22 pm
అయ్యో దేవుడా.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
తండ్రి ఆటో డ్రైవర్.. రెక్కలు ముక్కలు కష్టంతో కూతుర్ని ఉన్నతంగా చదివించాడు.. ఆ తండ్రి కష్టానికి తగ్గట్టుగా ఆమె కూడా ఎంతో ఇష్టంతో చదివింది.. టీచర్ కావాలని ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - టెట్ కు దరఖాస్తు చేసుకుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 14, 2025
- 7:05 am
Andhra News: టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
రాబోయే నెల రోజుల్లో విశాఖలోని అందాలను చేసేందుకు వెళ్లే పర్యాటకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుంకటే తొమ్మిది రోజులపాటు విశాఖ తీరంలో టూరిస్టుల పండుగకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యాయి.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 12, 2025
- 11:02 pm
Andhra: చలి గడ్డకట్టడం ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో మీకోసమే
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. గత రెండు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో.. పలుచోట్ల గాజు ముక్కలా మంచు పేరుకు పోతోంది. ఆ వివరాలు..
- Maqdood Husain Khaja
- Updated on: Dec 12, 2025
- 12:29 pm
Andhra News: వార్నీ.. ప్రకృతి వింత అంటే ఇదేనేమో.. ఒక మొక్క జొన్నకు ఇన్ని పొత్తులా..!
సాధారణంగా మొక్కజొన్నకు ఒకచోట ఒక పొత్తు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో రెండు మూడు పొత్తులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే మొక్క జొన్న చెట్టుకు ఏకంగా పదుల సంఖ్యలో పొత్తులు రాశాయి. ఈ ప్రకృతి విచిత్రం సామాన్యులకే కాదు.. మొక్కజొన్న రైతులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఆ మొక్కజొన్నలపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 11, 2025
- 10:32 pm
అస్తమానం ఫోన్ మాట్లాడొద్దన్నాడనీ.. భర్తని గొడ్డలితో నరికి చంపిన భార్య!
అల్లూరిజిల్లాలో దారుణం జరిగింది. అస్తమానం ఫోన్ మాట్లాడుతున్న భార్యను మందలించినందుకు భర్తపై పగబట్టింది ఓ ఇల్లాలు. అంతే తన ఫోన్ వ్యవహారాల్లో భర్త జోక్యం ఏంటని భావించి దారుణానికి పాల్పడింది. భర్తపై దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది కట్టుకున్న భార్య. గొడ్డలి కర్రతో దాడి చేయడంతో..
- Maqdood Husain Khaja
- Updated on: Dec 11, 2025
- 4:06 pm
Andhra Pradesh: ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది..?
లాడ్జిలో తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సింహాచలం దర్శనానికి వచ్చి.. ఉరివేసుకుని వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమా..? కొడుకు మానసిక సమస్యలతో బాధపడుతున్నారా..? అసలు ఏం జరిగింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 7, 2025
- 7:29 am
Andhra Pradesh: పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం వెనుక కథ గురించి తెలుసా..?
అల్లూరి జిల్లాలోని హుకుంపేటలో ఉన్న భీముని రాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వత అంచున స్థిరంగా ఉన్న ఈ భారీ బండరాయి వెనుక భీముడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. స్థానిక గిరిజనులు దీనిని అత్యంత నిష్టతో పూజిస్తారు. వారి సంస్కృతిలో ఇది ఒక భాగం.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 6, 2025
- 9:43 pm
Andhra: వారాంతంలో జాలరికి లక్ తగిలింది.. ఇదేంది సామి ఇంత ఉంది…
అల్లూరి సీతారామరాజు జిల్లా–ఓడిశా సరిహద్దులోని సీలేరు గుంటవాడ జలాశయంలో చేపల వేట సాగించే మత్స్యకారులకు అదృష్టం కలిసి వచ్చింది. ప్రతిరోజు మాదిరిగా వల వేసిన వారికి చాలా పెద్ద చేప చిక్కింది. ఆ ఒక్క చేప ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసుకుందాం పదండి ...
- Maqdood Husain Khaja
- Updated on: Dec 6, 2025
- 5:02 pm
Andhra: అయ్యో దేవుడా ఎంతపనైంది.. గాలిపటం కోసం వెళితే ప్రాణమే పోయింది..
గాలిపటం అంటే పిల్లలకు సరదా.. దాన్ని ఆకాశంలో ఎగరవేస్తూ.. అది తోక ఆడిస్తూ స్వేచ్ఛగా కదులుతూ ఉంటే ఆ ఆనందం పట్టలేనిది. ఎంత ఎత్తుకు వెళితే అంత ఉత్సాహంతో సంబరపడతారు పిల్లలు.. ఎంతసేపు ఆకాశంలో గాలిపటం ఉంటే.. అంత సమయం కూడా తెలియకుండానే గడిపేస్తుంటారు. అంతటి సరదాను తెచ్చిపెట్టే గాలిపటాలు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 2, 2025
- 8:06 pm
Vizag: పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఇక గాల్లో తేలిపోవాల్సిందే.. వీడియో చూశారా..
ఎత్తయిన కొండపై నుంచి లోతైన లోయలు పచ్చటి ప్రకృతి.. విశాలమైన సముద్రం.. అద్భుతమైన విశాఖ నగరం ఒకేసారి చూడాలని ఉందా..? అయితే కైలాసగిరి పైకి వెళ్తే చాలు.. అక్కడ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ మిమ్మల్ని మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. విమానంలో వెళ్తున్నప్పుడు ఉండే ఫీలింగ్ తో పాటు.. గాల్లో తేలినట్టు ఉండే త్రిల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 1, 2025
- 11:57 am
వార్నీ.. గంజాయిని పల్లీ ప్యాకెట్లలా గల్లీల్లో అమ్మేస్తున్నారు! విప్పితే ఒక్కటే ఘాటు వాసన..!
అనకాపల్లి జిల్లా పరవాడలో పోలీసులు గంజాయి దందాకు అడ్డుకట్ట వేశారు. అనుమానంతో ఇద్దరిని పట్టుకొని ప్రశ్నించగా, 425 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఒకరు, అనకాపల్లికి చెందిన మరొకరు కలిసి చిన్న ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్న ఈ పెడ్లింగ్ నెట్వర్క్ను పోలీసులు భగ్నం చేశారు.
- Maqdood Husain Khaja
- Updated on: Nov 29, 2025
- 11:53 pm