AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆ నౌకలోకి అడుగు పెట్టాలంటేనే హడలెత్తిపోతున్న కార్మికులు.. ఎందుకంటే లోపల..

విశాఖ షిప్‌యార్డ్‌లో మరమ్మతుల కోసం నిలిపిన భారతీయ సముద్ర పరిశోధన నౌకలో పాముల సంచారం కలకలం రేపింది. పనుల కోసం వెళ్లిన వర్కర్లకు అకస్మాత్తుగా పాము కనిపించి క్షణాల్లో మాయమవడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత..

Vizag: ఆ నౌకలోకి అడుగు పెట్టాలంటేనే హడలెత్తిపోతున్న కార్మికులు.. ఎందుకంటే లోపల..
Sagar Kanya Ship
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 1:36 PM

Share

విశాఖకు ఓ నౌక వచ్చి ఆగింది.. మరమ్మతుల కోసం లంగరు వేసుకుంది.. అందులో పనిచేసేందుకు వర్కర్లు వెళ్లారు.. వారికి ఒక్కసారిగా వాళ్లందరికీ ఒళ్ళు జలదరించే సీన్…! ఓ పాము కనిపించి క్షణాల్లో మాయమైంది. దీంతో అక్కడ ఉన్నవారు హడలెత్తిపోయారు. బయటకు పరుగులు తీసి నౌకలోని తలుపులు మూసేశారు. ఆ నౌకలో పాములు ఉన్నట్టు భయపడి.. ఎవరూ మళ్లీ లోపలికి వెళ్లే సాహసం చేయలేదు. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. మళ్లీ సేమ్ సీన్.. ఆ సమయంలో మరో పాము కనిపించడంతో స్నేక్ కేచర్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగరాజు.. ఓ పామును పట్టుకున్నారు.

భారీ కొండచిలువ కదులుతూ..

నౌకలో పాముల సంచారం హడలెత్తిస్తోంది. పాముల భయం నేపథ్యంలో ఆ నౌకలో జాగ్రత్తగా గాలించింది స్నేక్ క్యాచర్ నాగరాజు బృందం. కానీ పాముల జాడలేదు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు.. రాత్రి సమయంలో ఆ నౌకలో ఒక భారీ కొండచిలువ కనిపించింది. ఒక గది నుంచి నౌకలో మరోచోటకు వెళుతుంది. దీంతో హడాలెత్తిపోయిన వర్కర్లు.. మళ్లీ స్నేక్ కేసర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చే సమయానికి ఆ కొండచిలువ నౌకలోని మరోచోటకు వెళ్లిపోయింది. వెతికినా కనిపించలేదు.

బుసలు కొట్టిన నాగుపాము..!

ఆ తర్వాత మళ్లీ తాజాగా ఓ నాగుపాము నౌకలో హడలెత్తించింది. వెంటనే రంగంలోకి దిగిన క్యాచర్ నాగరాజు.. చీకట్లో నౌకలోని ఓ చోట నక్కినట్టు గుర్తించాడు. టార్చ్ లైట్ వెలుతురులో.. ఆ పామును చూసి పట్టుకుపోయాడు. దీంతో బుసలు కొడుతూ పైకి రాబోయింది ఆ నాగుపాము. అత్యంత చాకచక్యంగా.. ఎట్టకేలకు ఆ నాగుపామును రెస్క్యూ చేశాడు నాగరాజు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరమ్మతుల కోసం సాగర కన్య నౌక..

సముద్ర పరిశోధన నౌక సాగర కన్యలో ఈ పాముల బెడద భయపెడుతుంది. భారతీయ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక సాగర కన్య.. సముద్ర శాస్త్ర అధ్యయనాల్లో కీలకమైనది. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం తో పాటు హిందూ మహాసముద్రంలోనూ భూగర్భ సముద్ర వాతావరణ పరిశోధనల కోసం వినియోగిస్తారు. లోతైన సముద్ర మల్టీ బీమ్ సర్వేలు సముద్ర గర్భం భౌగోళిక సర్వేలు వాతావరణ అధ్యయనాలు చేస్తుంది.

‘అండమాన్ లో మరమ్మతుల కారణంగా ఈ నౌకను కొన్ని రోజులపాటు ఓచోట ఉంచేశారు. మరమ్మతుల కోసం షిప్పియార్డ్ కు తీసుకొచ్చారు. నౌక షిప్ యార్డ్ కు తీసుకువచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది. పాముల భయంతో నెల రోజుల పాటు అలాగే ఉంచేశారు. ఆ తర్వాత మళ్లీ మరమ్మత్తుల కోసం లోపలికి వెళ్తే పాములు కనిపించాయి. నౌక ఇంజన్ లోపల వైపు మరిన్ని పాములు ఉండే అవకాశం ఉంది.’ అని టీవీ9కు చెప్పాడు స్నేక్ క్యాచర్ నాగరాజు.

Follow Us