AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

చదువుకునే విద్యార్థులు.. అటు వైపు నుంచి వెళ్లే మహిళలు.. అందరూ రోజూ నరకం చూస్తున్నారు.. విశాఖలోని హెచ్‌బీ కాలనీ కృష్ణ కాలేజ్ రోడ్డులో ఉన్న జ్యోతి వైన్స్ స్థానికులకు శాపంగా మారింది. విద్యాలయాల పక్కనే ఉన్న ఈ షాప్ వద్ద మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయి. చీకటి పడితే చాలు.. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు, ఇళ్ల గోడల పక్కన మద్యం సేవిస్తూ మహిళలను, విద్యార్థినులను భయాందోళనకు గురిచేస్తున్నారు.

Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?
Visakhapatnam Wine Shop Protest
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 1:29 PM

Share

విశాఖలోని హెచ్ బీ కాలనీ.. కృష్ణ కాలేజ్ రోడ్డు.. అక్కడే జ్యోతి వైన్స్. విద్యార్థులు నిత్యం ఆ ప్రాంతం నుంచే స్కూల్లో కాలేజీలకు వస్తూ వెళ్తూ ఉంటారు. సమీపంలో విద్యాలయాలు కూడా ఉన్నాయి. జ్యోతి వైన్స్ వద్ద.. నిత్యం మందుబాబుల బెడద స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు మందుబాబుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. చీకటి పడితే చాలు ఆ సమస్య మర్రి తీవ్ర రూపం దాలుస్తోంది. వైన్ షాప్‌లో మద్యం చూసుకొని నేరుగా.. సమీపంలోనే అపార్ట్‌మెంట్స్ సెల్లార్లు, పరిసర ఇళ్ల గోడలు, గట్లపై కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు. అటుగా వెళుతున్న మహిళలు, విద్యార్థినిలు ఆ మందుబాబుల ఆగడాలకు భయాందోళనకు గురవుతున్నారు.

సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం కాకపోవడంతో ఇక తామే ఆ సమస్యను తీర్చుకోవాలని సిద్ధమయ్యారు. తాగుబోతుల వేధింపుల నుంచి కాపాడాలంటూ రోడ్డెక్కారు స్థానికులు. జనావాసాల మధ్య మద్యం షాపును తొలగించాలంటూ హెచ్.బి కాలనీలో ఆందోళన చేపట్టారు. పోస్టర్లు ఫ్లెక్సీలు చేత పట్టుకుని గళం విప్పారు. జ్యోతి వైన్స్ ఎదుట ధర్నా చేశారు. మందుబాబుల బెడదతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని పర్యవేక్షించారు. బహిరంగంగా మద్యం అమ్మకాలు, ఓపెన్ డ్రింకింగ్‌తో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. చోరీలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువయ్యాయని స్థానికులు వాపోయారు. వైన్ షాప్ వల్ల మందుబాబుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చేతులెత్తి వేడుకున్నారు స్థానికులు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.

Follow Us