LIC HFL Jobs 2026: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే నెలకు రూ.41,509 జీతం
దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న LIC Housing Finance Ltd జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్దులు ఈ పోస్టులకు..

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL).. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్దులు ఈ పోస్టులకు ఏప్రిల్ 16, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 కంటే ముందు 2005 ఏప్రిల్ 1 తరువాత జన్మించి ఉండరాదు. ఈ అర్హతుల కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 30, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు తమకు ఇష్టమైన ఏదైనా ఒక నగరంలోని ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.800 ఫీజుతోపాటు జీఎస్టీ ఫీజు కూడా చెల్లించాలి.
అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. రాత పరీక్ష 2026 జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారిక నెలకు రూ.38,709 నుంచి రూ.41,509 వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం
రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలకు ఉంటుంది. ఇంగ్లిష్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, కంప్యూటర్ స్కిల్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




