AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా.. తెలంగాణలో ఆపరేషన్ కంచుకోట!

ప్రత్యర్థుల నియోజకవర్గాలకు వెళ్లి విమర్శలు చేయడం వేరు.. ప్రత్యర్థుల ఇళ్ల ముందుకే వెళ్లి రాజకీయ యుద్ధం చేయడం వేరు. తెలంగాణలో ఈ సీనే కనిపిస్తోందిప్పుడు. మొన్న సిరిసిల్ల.. నిన్న సిద్దిపేట.. రేపు గజ్వేల్‌. కేసీఆర్ కుటుంబానికి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో వరుస సభలు పెడుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు సీఎం రేవంత్. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ రాజకీయ పునాదులనే కదిలించే వ్యూహమా అది! ఆ మూడు నియోజకవర్గాలను టార్గెట్ చేస్తే.. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలు ఈజీ టార్గెట్ అవుతాయనా? తెలంగాణలో నడుస్తున్న ఈ టార్గెట్ పాలిటిక్స్‌ వెనక అసలు ఉద్దేశమేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా.. తెలంగాణలో ఆపరేషన్ కంచుకోట!
Telangana Target Politics
Krishna S
|

Updated on: Nov 20, 2026 | 10:09 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యూహం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేసీఆర్. ఆ తర్వాత కేటీఆర్ అండ్ హరీశ్‌రావు. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఈ ముగ్గురే బీఆర్ఎస్ రాజకీయాల్లో కీ ఐకాన్స్. అలాంటి ముగ్గురు నేతల నియోజకవర్గాలనే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా టార్గెట్ చేస్తున్నారు. మొదట కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు వెళ్లారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో సభ పెట్టారు. ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌పై రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతోంది. ఒకవేళ ఈ ముగ్గురు నాయకులను వారి సొంత నియోజకవర్గాల్లోనే రాజకీయంగా ఇబ్బంది పెట్టగలిగితే.. దాని ప్రభావం కేవలం ఆ మూడు స్థానాలకే పరిమితం కాకపోవచ్చు. పార్టీ మొత్తం మీద పడొచ్చు. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన ఈ ముగ్గురు నాయకులు.. తమ నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ దూకుడును ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు.. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు మరింత ఈజీగా మారతాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పుడే ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పోరాటాన్ని మొదలుపెడితే.. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ఒత్తిడి పెంచినట్టవుతుంది. అందుకేనా.. ఈ మూడు నియోజకవర్గాలను ఇంత గట్టిగా టార్గెట్ చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి? అంటే.. ఇక్కడ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమేనా? లేక ప్రత్యర్థి నాయకుల మెజారిటీని తగ్గించడమా? వీలైతే ఈ ముగ్గురినీ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
 కొత్తజంట పెళ్లయిన ఏడాది వరకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా?
 కొత్తజంట పెళ్లయిన ఏడాది వరకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా?
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..