AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ ఎస్సై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్! ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నవంబర్ 28 అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 29న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు పోటీపడుతున్న ఈ పరీక్షలో కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు ఎన్ని? హాల్‌టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి!

SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్.. పరీక్ష ఎప్పుడంటే?
Telangana SI Hall Tickets
Srilakshmi C
|

Updated on: Nov 20, 2026 | 12:14 PM

Share

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ల విడుదల తేదీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TGS​​LPRB) ప్రకటించింది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు. నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. 275 సివిల్ ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి నవంబర్ 29వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ హాల్‌టికెట్లను భద్రపరచుకోవాలని పోలీసు నియామక మండలి సూచించింది. ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో రాసే అవకాశం కల్పించారు. అభ్యర్థుల మీడియం ఎంపికను పరిశీలిస్తే.. అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగు మీడియంను ఎంచుకున్నారు. 43.02 శాతం మంది ఇంగ్లీష్, 0.12 శాతం మంది ఉర్దూ మీడియంలో పరీక్ష రాయడానికి ఆసక్తి చూపారు.

తెలంగాణ ఎస్ఐ ఉద్యోగాల హాల్ టికెట్లు డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్సై ఉద్యోగాల ఖాళీల వివరాలు

ఈ నియామక ప్రక్రియలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
  • ఎస్సై (సివిల్) – 148 పోస్టులు
  • ఎస్సై (ఆర్మ్‌డ్ రిజర్వ్) – 14 పోస్టులు
  • ఎస్సై (టీజీఎస్పీ) – 12 పోస్టులు
  • ఎస్సై (ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌) – 3 పోస్టులు
  • ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23 పోస్టులు

2022 పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కుల విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని కేటగిరీల అభ్యర్థులకు అర్హత మార్కుల నిబంధనల్లో మార్పులు కల్పించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు ఇలా ఉన్నాయి.

  • ఓసీ, ఈడబ్ల్యూఎస్: 30 శాతం – 60 మార్కులు
  • బీసీ: 25 శాతం – 50 మార్కులు
  • ఎస్సీ, ఎస్టీ: 20 శాతం – 40 మార్కులు
  • మాజీ సైనికులు, హోంగార్డులు: 20 శాతం – 40 మార్కులు

గత నియామకంతో పోలిస్తే ఈసారి కనీస అర్హత మార్కుల నిబంధనల్లో మార్పులు కొందరు అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశంగా మారాయి. అయితే కనీస అర్హత మార్కులు సాధించడం మాత్రమే ఉద్యోగానికి ఎంపికైనట్లు కాదు. తదుపరి ఎంపిక దశల్లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • హాల్‌టికెట్ల విడుదల: నవంబర్ 22, ఉదయం 8 గంటల నుంచి
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చివరి తేదీ: నవంబర్ 28, అర్ధరాత్రి 12 గంటల వరకు
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: నవంబర్ 29
  • పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.inను సందర్శించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్ష కేంద్రం, సమయం, ఇతర సూచనలను ముందుగానే పరిశీలించుకోవాలి. పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలి. ఎస్సై ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు నిర్లక్ష్యం చేయకుండా పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునే వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

Follow Us