AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!

రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయియి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేశారు..

TS Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
TS-Inter-Result-toppers
Srilakshmi C
|

Updated on: Apr 12, 2026 | 12:13 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయియి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 75.61 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 66.20శాతం మంది, సెకండ్‌ ఇయర్‌లో 70.58 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ https://tgbie.cgg.gov.in లేదా https://tgbie.in/result.html తోపాటు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలను 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి.

గతేడాది కంటే పెరిగిని ఇంటర్ ఇత్తీర్ణత శాతం.. ఈ సారి ఎంతో తెలుసా?

గతేడాది కంటే ఈ సారి తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2025లో కేవలం 67.45 శాతం మంది ఉత్తీర్ణత పొందగా.. 2026 సంవత్సరానికి ఏకంగా 71.15 శాతం మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులకు సబ్జెక్ట్‌ వైజ్‌ మార్కుల మెమోలను ఆదివారం (ఏప్రిల్ 12) సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40 శాతం ఉండగా వీరిలో బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో మొత్తం 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,58,490 మంది (70.58శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం, బాలుర ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 82.73 శాతం మార్కులతో అత్యధిక మంది విద్యార్దులు ఉత్తీర్ణత పొందారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..