AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?

Actress Subhashini Suicide: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్‌ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది..

Actress: ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?
Actress Subhashini Suicide
Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 4:54 PM

Share

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చెన్నై నగరంలోని పోరూరులో ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నటి సుభాషిణి ఈ రోజు భర్తతో వీడియో కాల్‌ మాట్లాడింది. ఈ సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన నటి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుభాషిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీలంక మూలాలకు చెందిన నటి సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివాసం ఉండేది. అయితే షూటింగ్‌ల కారణంగా చెన్నైలోని అయ్యప్పంతంగళ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుంది. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో ‘ఇని అవన్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా తమిళ టీవీ సీరియల్ ‘కాయల్‌’తో ద్వారా మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే సుభాషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకుపైగా ఫాన్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంది.

ప్రాథమిక సమాచారం మేరకు.. నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సుభాషిణి పుట్టినరోజు కేవలం ఆరు రోజుల్లోనే ఉంది. ఏప్రిల్ 12న తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెల ఏప్రిల్ 21న ఆమె రెండవ వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. నటి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడనున్నాయి. ఈ ఘటనతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..