AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్‌ చేయించి నువ్వు ఉన్నావని నిరూపించుకో..’ గుళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు

Students flood temple with pleas for better results: పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ నెల రెండో వారంలో వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఆలయాలు, గుడుల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరీక్షల్లో తమను పాస్‌ చేయాలని, మంచి మార్కులు రావాలని విద్యార్ధులు మొక్కులు కోసం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విచిత్ర ఘటన

‘దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్‌ చేయించి నువ్వు ఉన్నావని నిరూపించుకో..’ గుళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు
Students Visitings Temple In Bhopal
Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 4:50 PM

Share

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నెల రెండో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఆలయాలు, గుడుల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరీక్షల్లో తమను పాస్‌ చేయాలని, మంచి మార్కులు రావాలని విద్యార్ధులు మొక్కులు కోసం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో భోపాల్‌లోని విద్యార్థులు ఫలితాల గురించిన ఆందోళన చెందుతున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు మంచి మార్కులు, విజయం కోసం ప్రార్థించడానికి దేవాలయాలను సందర్శిస్తున్నారు.నగరంలోని అనేక దేవాలయాల్లోని విరాళాల పెట్టెలు చేతితో రాసిన కోరికల లేఖలతో నిండిపోతున్నాయి. కొంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తున్నారు. మరికొందరు తమ కోరికలు నెరవేరితే లడ్డూలు, ఉపవాసం, ఆలయ పూజలు వంటివి సమర్పిస్తామని మొక్కుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ బోర్డు 10వ, 12వ తరగతి ఫలితాలు ఏప్రిల్ రెండవ వారంలో వెలువడనుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు దేవాలయాలను సందర్శిస్తున్నారు. పరీక్షలలో విజయం సాధించాలనే ఆశతో వారు రాసిన ప్రార్థనలను విరాళాల పెట్టెల్లో వేస్తున్నారు. న్యూ మార్కెట్‌లోని శని దేవాలయం, జహంగీరాబాద్‌లోని ఖట్లాపురా దేవాలయం, 1100 క్వార్టర్స్ సమీపంలోని గణేష్ దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలకు విద్యార్ధుల తాకిడి విపరీతంగా పెరిగింది.

దేవాలయాలకు వచ్చిన విద్యార్థులు మొదట ప్రార్థనలు చేసి, ఆ తర్వాత తమ కోరికలను కాగితపు చీటీలపై రాసి విరాళాల పెట్టెల్లో వేస్తున్నట్లు న్యూ మార్కెట్‌లోని శని ఆలయ పూజారి అరుణ్ బుచ్కే తెలిపారు. ఫలితాలు వెలువడటానికి ముందు ప్రతి ఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈసారి కాస్త ఎక్కువగా చీటీలు వచ్చాయని తెలిపారు. పరీక్షల ఆందోళన కారణంగా విరాళాల పెట్టెలు ఈ చీటీలతో నిండిపోయాయని ఆయన అన్నారు. చాలావరకు 10వ, 12వ తరగతి విద్యార్థుల నుంచే ఈ చీటీలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ లేఖలు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడికి మొక్కులను వ్యక్తం చేస్తున్నాయి. అలాగే విద్యార్ధుల కోరికలు నెరవేరిన తర్వాత తమ మొక్కులను తీర్చుకోవడానికి మళ్లీ ఆలయానికి తిరిగి వచ్చి మొక్కులను చెల్లించుకుంటారని ఆయన తెలిపారు. చాలామంది ప్రత్యేక పూజలు చేసి, దీపాలు వెలిగిస్తారు. ప్రసాదాలు కూడా పంచుతారని అన్నారు. అయితే ఈ చీటీల్లో పలు విలక్షణమైన కోరికలు ఉన్నట్లు తెలిపారు. ఒక విద్యార్థిని తాను ఉత్తీర్ణురాలైతే వంద ప్రదక్షిణలు చేస్తానని రాసింది. మరొకరు మంచి మార్కులు వస్తే లడ్డూలు సమర్పిస్తానని రాశాడు. ఒక విద్యార్థి తాను విజయం సాధిస్తే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి, హనుమంతుడిని పూజిస్తానని రాశాడు. మంచి ఫలితాలతో తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలనే కోరికను అనేక చీటీల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మధ్యప్రదేశ్‌లో సుమారు 85 శాతం పదో తరగతి, ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి బుద్ధేష్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ రెండవ వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల మంది ఉపాధ్యాయులు దాదాపు 90 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నట్లు వివరించారు. సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులకు తగిన సమయం లభించేలా ఫలితాలను ముందుగానే ప్రకటించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. సప్లిమెంటరీ పరీక్ష మే 7న ప్రారంభమవుతుంది. ఒకవేళ ఫలితాలు ఏప్రిల్ 14, 15 తేదీల మధ్య విడుదలైతే విద్యార్థులకు సిద్ధం కావడానికి సుమారు 20 రోజుల సమయం ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us