AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాస్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అక్కడే కొనసాగుతోందని.. దీని ప్రాభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందో వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Anand T
|

Updated on: Aug 12, 2026 | 3:30 PM

Share
ఏపీ వాసులకు రాష్ట్ర వివపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ప్రస్తుతం అక్కడే కొనసాగుతోందని.. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని.. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది.

1 / 5
ఆ తర్వాత, ఇది వాయుగుండంగా బలపడి, తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తర భారతదేశ ద్వీపకల్పము మీదుగా సుమారుగా 22° ఉత్తర అక్షాంశం వెంబడి ఒక షియర్ జోన్ సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపుకు వంగి ఉంటుందని.. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

2 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానం:  వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అవకాశముంది. అలాగే గురు, శుక్రవారాల్లో  వర్షాలతో పాటు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

3 / 5
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం: బుధవారం కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. అలాగే గురు, శక్రవారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అలాగే వర్షం సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

4 / 5
రాయలసీమ వాతావరణం: రాయలసీమలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు  చోట్ల  కురిసే అవకాశముందనితెలిపింది. ఇక శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. వర్షం సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

5 / 5
Follow Us