AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?

ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారుడి వలకు భారీ మండపీత చిక్కింది. ఏకంగా 1.4 కిలోల బరువున్న ఈ అరుదైన పీతను వేలంలో ఉప్పాడకు చెందిన కొండపల్లి శివ రూ.1,400లకు కొనుగోలు చేశాడు. సాధారణంగా కిలో బరువు వరకు ఉండే మండపీత 1.4 కిలోలు ఉండటం విశేషమని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?
Giant Mud Crab
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 3:30 PM

Share

మంచి ప్రొటీన్లు, విటమిన్‌ బి12, జింక్‌, సెలీనియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే మండపీతలు సాధారణంగా మడ అడవులు, ఉప్పునీటి కాలువలు, నదీముఖ ద్వారాలు, తీరప్రాంత బురద నేలల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇవి అరుదుగా లభిస్తుంటాయి.

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు భారీ పరిమాణంలో ఉన్న మండపీత చిక్కింది. దీనికి వేలం నిర్వహించగా ఉప్పాడకు చెందిన కొండపల్లి శివ రూ.1,400లకు కొనుగోలు చేశాడు. ఈ మండపీత బరువు ఏకంగా 1.4 కిలోలు ఉండటం విశేషం.

మడ అడవుల పరిధిలో లభించే మండపీతలు సాధారణంగా కిలో బరువు వరకు ఉంటాయని, 1.4 కిలోల బరువున్న పీత లభించడం అరుదని జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శ్రీరామకృష్ణ తెలిపారు. మార్కెట్లో మండపీతలకు మంచి డిమాండ్‌ ఉందని పేర్కొన్నారు.

మండపీతలను మితంగా తీసుకోవడం వల్ల కండరాలు, నరాల పనితీరుకు, రోగనిరోధక శక్తి మెరుగుపడేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పీతలకు అలెర్జీ ఉన్నవారు, యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పీతలను పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us