AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. Wipro లేడీ టెకీని హత్య చేసిన ప్రియుడు!

పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతి కోమల్ రాజేంద్ర దహాకే హత్యకు గురైంది. మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడితో జరిగిన వివాదమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న ఆమె లివ్‌-ఇన్‌ పార్ట్‌నర్ శుభమ్ జ్ఞానేశ్వర్ కల్బాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు..

దారుణం.. Wipro లేడీ టెకీని హత్య చేసిన ప్రియుడు!
Wipro Software Engineer Allegedly Killed
Srilakshmi C
|

Updated on: Nov 25, 2026 | 7:25 AM

Share

ముంబై, నవంబర్ 25: మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో జరిగిన గొడవలో విప్రోలో పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆమె లివ్-ఇన్ పార్ట్‌నర్ హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నవంబర్ 23, 2026 తెల్లవారుజామున హింజేవాడిలోని ఓ పీజీ వసతి గృహంలో జరిగింది. నిందితుడు కూడా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం..

మృతురాలు కోమల్ రాజేంద్ర దహాకే (27) మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన యువతి. నిందితుడు శుభమ్ ద్యానేశ్వర్ కల్బాండే బుల్దానా ప్రాంతానికి చెందినవాడు. వీరిద్దరూ పుణెలోని ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకూ తెలుసని, పెళ్లికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత రెండు, మూడు నెలలుగా శుభమ్ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో కోమల్ అతడితో తరచూ గొడవ పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో నవంబర్ 22 ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు భోజనానికి వెళ్లారు. అక్కడే వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

అనంతరం ఇద్దరూ హింజేవాడిలోని సఖారే వస్తీ ప్రాంతంలో ఉన్న కోమల్ పీజీ గదికి చేరుకున్నారు. అక్కడ కూడా గొడవ కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో శుభమ్ కోమల్‌పై దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దాడి జరిగిన తర్వాత నిందితుడు కొన్ని గంటల పాటు మృతదేహం వద్దే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం ఉదయం సుమారు 6.30 గంటలకు హింజేవాడి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కావాలని కోరాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కోమల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ప్రాథమిక విచారణ, ఇతర వివరాల ఆధారంగా శుభమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పుణె జోన్-2 డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రదీప్ జాదవ్ స్పందిస్తూ.. మృతురాలు విప్రోలో, నిందితుడు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని తెలిపారు. హింజేవాడి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పుణె ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Follow Us