AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వార్త వింటే పల్సర్​ బైక్ లవర్స్​ మతిపోతుంది భయ్యా.. అదిరిపోయే మార్పులతో RS200 వచ్చేసింది

స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారికి Bajaj Auto గుడ్‌న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ Pulsar RS200ను కొత్త ఫీచర్లు, అప్‌డేట్లతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈసారి కేవలం డిజైన్ మార్పులకే పరిమితం కాకుండా.. రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే టెక్నాలజీని కూడా జోడించింది. ముఖ్యంగా 5 అంగుళాల TFT డిస్‌ప్లే, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు కొత్త మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ వార్త వింటే పల్సర్​ బైక్ లవర్స్​ మతిపోతుంది భయ్యా.. అదిరిపోయే మార్పులతో RS200 వచ్చేసింది
Bajaj Pulsar Rs200
Nikhil
|

Updated on: Nov 25, 2026 | 6:50 AM

Share

ప్రస్తుతం బైక్ కొనుగోలుదారులు కేవలం ఇంజిన్ పవర్ మాత్రమే కాకుండా.. స్మార్ట్ ఫీచర్లు, భద్రత, హ్యాండ్లింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త Pulsar RS200లో Bajaj పలు కీలక మార్పులు చేసింది. అయితే ఫీచర్లు పెరిగినట్టుగానే ధర కూడా పెరిగింది. పాత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ.17,000 ఎక్కువ ధరతో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. మరి కొత్త RS200లో ఎలాంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయో చూద్దాం.

కొత్త రైడింగ్ ఫీచర్లు

2026 Bajaj Pulsar RS200 ధరను రూ.1.98 లక్షలుగా నిర్ణయించారు. గతంలో అందించిన సాధారణ LCD డిస్‌ప్లే స్థానంలో ఇప్పుడు 5 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో Google Maps మిర్రరింగ్ సదుపాయం ఉండటంతో ప్రయాణ సమయంలో నావిగేషన్ వివరాలను డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. అదనంగా USB Type-C ఛార్జింగ్ పోర్ట్‌, హజార్డ్ స్విచ్‌, అడ్జస్టబుల్ లివర్లను అందించారు.

కొత్త మోడల్‌లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీని కూడా జోడించారు. దీని ద్వారా రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా రైడ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ బైక్‌పై నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్విక్‌షిఫ్టర్ ద్వారా గేర్లు మార్చుకోవడం మరింత సులభమవుతుంది. ఈ ఫీచర్లు గత నెలలో Pulsar NS200కు అందించిన అప్‌డేట్ల తరహాలోనే RS200లోనూ వచ్చాయి.

199.5cc ఇంజిన్‌..

కొత్త Pulsar RS200లో 199.5cc సింగిల్ సిలిండర్‌, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఎలక్ట్రానిక్ థ్రాటిల్ అప్‌డేట్ కారణంగా ఇంజిన్ పవర్ 1hp పెరిగింది. ఇప్పుడు ఈ ఇంజిన్ 25.5hp పవర్‌, 18.7Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్ విషయంలోనూ కీలక మార్పు చేశారు. గతంలో ఉన్న టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో 37mm USD ఫ్రంట్ ఫోర్క్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి బైక్ హ్యాండ్లింగ్‌, స్టెబిలిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

ధర, పోటీ విషయానికి వస్తే కొత్త Pulsar RS200 రూ.1.98 లక్షలకు అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో దీనికి Hero Karizma XMR ప్రధాన పోటీ ఇవ్వనుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.86 లక్షలుగా ఉంది. మరోవైపు KTM RC 200 ధర రూ.2.33 లక్షలుగా ఉంది. కొత్త ఫీచర్లు, పెరిగిన ఇంజిన్ పవర్‌తో Pulsar RS200 స్పోర్ట్స్ బైక్ విభాగంలో మరింత పోటీని ఇవ్వనుంది.

Follow Us