AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాకు అమ్మా నాన్న లేరు సార్.. మీరే నాకు అమ్మా నాన్న! పాస్‌ చేయండి సార్‌..’

ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి బతిమిలాడుకునే వారిని చూశాం.. పాస్ చేయకపోతే చంపేస్తానని బెదిరించే వాళ్లను కూడా చూశాం. ఈ ఏడాది అంతకు మించి అన్నట్లు మరో ఆణిముత్యం బయటకు వచ్చింది..

'నాకు అమ్మా నాన్న లేరు సార్.. మీరే నాకు అమ్మా నాన్న! పాస్‌ చేయండి సార్‌..'
Telangana Inter Student Answer Sheet
Srilakshmi C
|

Updated on: Mar 24, 2026 | 1:22 PM

Share

పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారని.. తల్లిదండ్రులు గంపెడు ఆశలతో పెద్ద కాలేజీల్లో చేర్పించి, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తుంటారు. అయితే వారి పిల్లలు మాత్రం ఫోన్లలో రీల్స్‌ చేయడానికి, సోషల్‌ మీడియాలో గంటల కొద్ది గడపడానికి ఆసక్తి చూపుతూ చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. తీరా పరీక్షల సమయంలో అడ్డదారులు తొక్కుతుంటారు. సాధారణంగా ఇలా టైం పాస్‌ చేసే విద్యార్ధులు ఆన్సర్ షీట్లలో తమను పాస్‌ చేయాలని టీచర్లను రకరకాలు వేడుకుంటూ ఉంటారు. కొందరు ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి పాస్‌ చేయమని బతామాలుకుంటే.. మరికొందరు సినిమా స్టోరీలు, పాటలు రాసి పేజీలు నింపేస్తుంటారు.

అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు పూర్తవడంతో సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ క్రమంలో పేపర్లు దిద్దుతున్న మాస్టర్లకు ఇలాంటి మరో ఆణిముత్యం తగిలింది. ఓ విద్యార్ధి ఆన్సర్ షీట్లో రాసిన సమాధానం, గీసిన బొమ్మలు చూసి ఎగ్జామినర్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో వెంటనే సదరు ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం రాశాడంటే..

Inter Student Answer Sheet

ఇవి కూడా చదవండి

ఈ ఆన్సర్ షీట్‌లో సదరు విద్యార్థి.. ‘సార్.. నాకు అమ్మా నాన్న లేరు సార్. మీరే నాకు అమ్మా నాన్న. నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’ అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా గురువు కాళ్లపై శిష్యుడు బోర్లా పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ కూడా గీశాడు. గురువు బొమ్మ దగ్గర ‘సార్’ అని, శిష్యుడి బొమ్మ దగ్గర ‘నేను’ అని రాసి సదరు విద్యార్థి తన టాలెంట్‌ చూపించాడు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ నెట్టింట వైరల్ కావడతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఎంతకు తెగించార్రా’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. మరోకరు ‘ఇప్పుడు ఫెయిల్ ఐతే ఏంటంట? నీకు అర్థం అవుతుందా..’ అని కామెంట్ పెట్టారు. ఇంకా.. ‘వీడు పాసైన ఫెయిలైన జబర్దస్త్‌ లాంటి షోకి వెళ్తే ఫేమస్‌ అవుతాడు’, ‘ఇచ్చేయండి సార్.. పాస్ మార్కులు ఇచ్చేయండి’ అంటూ మీమ్స్‌తో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకు తల్లిదండ్రులు లేరని, చదువుకున్నది గుర్తుకు రావట్లేదని, దయచేసి పాస్ చేయాలని విద్యార్థి వేడుకుంటున్న ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదుగానీ.. విద్యార్థి వేడుకుంటున్న విధానం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..