SSC Exam Dates 2026: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు, సిటీ ప్లిప్, అడ్మిట్ కార్డుల తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పేపర్ 2, కంబైన్‌డ్ హాయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్ 2025 పేపర్2 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) త్వరలో

హైదరాబాద్, మార్చి 24: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పేపర్ 2, కంబైన్‌డ్ హాయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్ 2025 పేపర్2 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) త్వరలోనే విడుదల చేసింది. అలాగే స్క్రైబ్‌కు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచనుంది. అభ్యర్ధులు తమ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షకు 4 రోజులు ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. కాగా ఎస్సెస్సీ జేఈ పరీక్ష ఏప్రిల్ 7న, సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్ష ఏప్రిల్ 10న జరగనున్నాయి.
జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు మార్చి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 4న విడుదల అవుతాయి. సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇక అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 7 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు తన ప్రకటనలో వెల్లడించింది. ఇక ఆయా పరీక్షలకు సొంతంగా స్క్రైబ్‌ను తెచ్చుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్సెస్సీ వివరించింది. జేఈ పరీక్షకు స్క్రైబ్ మ్యాపింగ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 3, అలాగే సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్ష కోసం స్క్రైబ్ మ్యాపింగ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 5గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఈ మేరకు ఆయా తేదీల్లో తగిన విధంగా స్పందించాలని బోర్డు సూచించింది.
ఎస్‌ఎస్‌సీ జేఈ, సీహెచ్‌ఎస్‌ఎల్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల 2026 డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిగ.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




