AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు!

నెలవారీ సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు.. ఇలా ఇంటికి అవసరమైన అనేక వస్తువులు ఒకే చోట తక్కువ ధరలకు లభించడంతో డీమార్ట్‌లో షాపింగ్ చేయడం చాలామంది కుటుంబాలకు అలవాటుగా మారింది. అయితే తక్కువ ధరలు, ఆఫర్లు ఉండటంతో ముఖ్యంగా వారాంతాల్లో స్టోర్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. దీంతో పార్కింగ్ కోసం ఇబ్బంది పడటమే కాకుండా, వస్తువులు ఎంచుకోవడానికి, బిల్లింగ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే రద్దీని తగ్గించుకోవడంతో పాటు అనవసర ఖర్చులను కూడా నియంత్రించుకోవచ్చు.

డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు!
Dmart Shopping TipsImage Credit source: Tv9 marathi
Jyothi Gadda
|

Updated on: Aug 12, 2026 | 3:25 PM

Share

నెలవారీ సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు.. ఇలా ఇంటికి కావలసిన ప్రతి వస్తువు ఒకే చోట, తక్కువ ధరలకే లభించే ఉత్తమ వేదిక డీమార్ట్. దాంతో ప్రతినెల డీమార్ట్ షాపింగ్ చేయడం చాలా కుటుంబాలకు ఒక అలవాటుగా మారింది. అయితే తక్కువ ధరలు, మంచి ఆఫర్లు ఉండటం వల్ల అక్కడ ఎప్పుడూ విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా, ప్రశాంతంగా షాపింగ్ చేస్తూ డబ్బు కూడా ఎలా ఆదా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రోజున షాపింగ్ చేయడం మేలు?

సాధారణంగా పెద్ద రిటైల్ స్టోర్లలో శుక్రవారం నుండి ఆదివారం వరకు రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, కుటుంబాలు సాయంత్రం వేళల్లో షాపింగ్‌కు రావడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి వారంలో మొదటి భాగమైన సోమవారం నుండి గురువారం మధ్య రోజులలో షాపింగ్ చేయడం వల్ల రద్దీ బారిన పడకుండా ఉండవచ్చు.

రద్దీ లేని సమయాలు :

రద్దీని నివారించడానికి సులువైన మార్గం ఏమిటంటే, స్టోర్ తెరిచే సమయానికే అక్కడికి చేరుకోవడం. ఆ సమయంలో జనాలు తక్కువగా ఉండటంతో పాటు ప్రశాంతంగా వస్తువులను ఎంచుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య కూడా సాధారణంగా జనసంచారం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళలు అత్యంత రద్దీగా ఉంటాయి.. కాబట్టి వాటిని ఆయా టైమింగ్స్‌లో వెళ్లకపోవటం మంచిది.

ఇవి కూడా చదవండి

డీమార్ట్ యాప్ ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోండి:

షాపింగ్‌కు బయలుదేరే ముందే డీమార్ట్ రెడీ యాప్‌లో ధరలు, స్టాక్, ఆఫర్లను చెక్ చేయడం ఒక మంచి అలవాటు. కొన్నిసార్లు ఆన్‌లైన్ ధరలు, నేరుగా స్టోర్‌లో ఉండే ధరల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. ముందే ధరలను సరిపోల్చుకోవడం వల్ల మెరుగైన ఆదా లభిస్తుంది.

ఆఫర్ల బురిడీలో పడకండి:

డిస్కౌంట్ కనిపించింది కదా అని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం పెద్ద పొరపాటు. షాపింగ్‌కు వెళ్లే ముందే ఇంట్లో లేని వస్తువులతో ఒక ఖచ్చితమైన లిస్ట్‌ తయారు చేసుకోండి. స్టోర్‌కు వెళ్లాక కేవలం ఆ జాబితాలోని వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి.

మొత్తంగా చెప్పాలంటే, డీమార్ట్‌లో ప్రశాంతమైన షాపింగ్ అనుభూతిని పొందడానికి వారపు రోజులలో ఉదయం పూట వెళ్లడం, ముందే లిస్ట్ సిద్ధం చేసుకోవడం, డిస్కౌంట్ల పేరుతో అనవసర వస్తువులు కొనకపోవడం చాలా ముఖ్యం. ఇది మీ సమయాన్ని, డబ్బును రెండింటినీ ఆదా చేస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us