AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టూవీలర్ మార్కెట్‌కి “టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్” గుడ్ బై.. కారణం ఇదేనా ??

తక్కువ ధరలో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌లలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' (TVS Star City Plus) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టూవీలర్ మార్కెట్‌లో హీరో స్ల్పెండర్‌‌కు గట్టి పోటీ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బైక్‌ను ఇప్పుడు కంపెనీ నిలిపేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టూవీలర్ మార్కెట్‌కి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ గుడ్ బై.. కారణం ఇదేనా ??
Tvs Star City Plus
Korivi Jayakumar
|

Updated on: Nov 21, 2026 | 2:21 PM

Share

సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా.. తక్కువ ధరలో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌లలో ‘టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్’ (TVS Star City Plus) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టూవీలర్ మార్కెట్‌లో హీరో స్ల్పెండర్‌‌కు గట్టి పోటీ ఇచ్చిన బైక్ అంటే ఇదేనని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన రైడింగ్.. బెస్ట్ మైలేజీ ఇచ్చే ఈ వాహనం రోజువారీ ప్రయాణాలకు ఉత్తమ ఎంపికగా నిలిచింది. సాధారణ వినియోగంలో లీటరు పెట్రోల్‌కు సుమారు 68 నుంచి 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇచ్చేది. తక్కువ ధర, మంచి మైలేజ్‌, లో మెయింటనెన్స్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ఈ బైక్‌ను ఇప్పుడు కంపెనీ నిలిపేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కనుమరుగు కానున్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్..

ఈ మేరకు టీవీఎస్ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మోడల్ ని తొలగించింది. 12 ఏళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్‌కు గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. చివరిసారిగా బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఐదేళ్ల క్రితం చివరిసారిగా అప్‌డేట్ చేశారు. అలానే మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీవీఎస్ మరో బైక్ రేడియాన్‌.. ఫీచర్లు, మోడల్ విషయంలో స్టార్ సిటీ ప్లస్‌కు దగ్గరగా ఉండటంతో డిస్‌కంటిన్యూ చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ బైకును 2014లో లాంచ్ చేయగా.. ప్రారంభంలో కేవలం రూ.44,000 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో 100సీసీ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న పలు టూ వీలర్లకు ఇది గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు.

వాహనదారులకు సూచనలు..

అయితే ఈ బైక్ ఆగిపోయినప్పటికీ, ప్రస్తుతం స్టార్ సిటీ ప్లస్ వాడుతున్న వాహనదారుల వారంటీ హక్కులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలుస్తోంది. కంపెనీ ఆమోదిత సర్వీస్ సెంటర్లలో నిర్ణీత సమయానికి సర్వీసింగ్ చేయించుకుంటే సాధారణంగా 5 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వరకు వారంటీ వర్తిస్తుంది. విడిభాగాలు, సర్వీస్ వ్యవధుల గురించి టీవీఎస్ సర్వీస్ పేజీల్లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదురైతే ఇబ్బంది లేకుండా ఉండేందుకు సర్వీస్ ఇన్వాయిస్‌లను సురక్షితంగా ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

అధిక మైలేజ్ ఇచ్చే 100-110సీసీ ప్రత్యామ్నాయ బైక్‌లు..

  • టీవీఎస్ స్పోర్ట్ – లీటర్‌కు 80 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ మైలేజ్‌
  • టీవీఎస్ రాడియాన్ – 73.68 కిలోమీటర్ల మైలేజ్
  • హీరో స్ప్లెండర్ ప్లస్ – 70 కి.మీ,
  • బజాజ్ ప్లాటినా 100 – 74.6 కి.మీ మైలేజ్ ఇస్తాయి.
  • హోండా షైన్ 100 – అధికారిక సంఖ్యలను వెల్లడించకపోయినా.. బెస్ట్ మైలేజ్‌ అని ప్రచారం జరుగుతోంది.

Follow Us