AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: కొత్త చిక్కులు తెస్తున్న గోల్డ్‌ లోన్‌.. అదేంటో తెలుసా..?

Gold Loan Problems: ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత దిగొచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువ తగ్గేవరకు పసిడి ధరలు కోలుకోవడం కష్టమని భావిస్తున్నారు. అయితే, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం..

Gold Loan: కొత్త చిక్కులు తెస్తున్న గోల్డ్‌ లోన్‌.. అదేంటో తెలుసా..?
Gold Loan
Subhash Goud
|

Updated on: Nov 21, 2026 | 12:24 PM

Share

Gold Loan Problems: బంగారం ధరలు భారీగా పడిపోవడం వల్ల గోల్డ్ లోన్‌లు తీసుకున్న రుణగ్రహీతలకు అనూహ్యమైన చిక్కులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల నుంచి అదనపు నగదు చెల్లించాలని లేదా మరింత బంగారం జమ చేయాలని మెసేజ్‌లు వస్తుండటంతో రుణగ్రహీతల్లో కలవరం రేగుతోంది. బంగారం ధరలు తగ్గితే సాధారణంగా కొనుగోలుదారులకు లాభం. కానీ లోన్ తీసుకున్న వారికి మాత్రం ఇది పెద్ద సమస్యగా మారింది.

నెల రోజుల కిందట రూ. లక్షా 50 వేల మార్కును దాటిన తులం బంగారం ధర ఇప్పుడు రూ. లక్షా 25 వేలకు పడిపోయింది. ఆల్ టైం గరిష్ట స్థాయిలతో పోలిస్తే దాదాపు రూ. 50,000 మేర ధర తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా, గోల్డ్ లోన్ తీసుకున్న వారికి మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఉదాహరణకు రెండు లక్షల రూపాయల విలువైన బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర అప్పు తీసుకుంటే, బంగారం ధర తగ్గడంతో ఇప్పుడు దాని విలువ లక్షా 60 వేలకు పడిపోవచ్చు. అయితే, బ్యాంకుకు కట్టాల్సిన అసలు, వడ్డీ మొత్తం మాత్రం అలాగే ఉంటాయి. బ్యాంకులు సాధారణంగా తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తాయి. బంగారం ధర పడిపోవడంతో మీ బంగారం విలువకు, మీ అప్పుకు మధ్య ఉన్న మార్జిన్ లైన్ దాటిపోతుంది. ఆర్థిక పరిభాషలో దీనిని లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి పెరగడం అంటారు. మీ అప్పుకు సరిపడా విలువను తిరిగి సర్దుబాటు చేయడానికి బ్యాంకులు రుణగ్రహీతలకు హెచ్చరిక మెసేజ్‌లు పంపుతాయి.

ఇది కూడా చదవండి: Gold: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? నిబంధనలు పాటించకుంటే చిక్కులే..!

ఈ మెసేజ్‌లకు స్పందించకపోతే రుణగ్రహీతలు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. గడువులోగా కొంత నగదు చెల్లించి అప్పు భారాన్ని తగ్గించుకోవాలి లేదా మరి కొంత బంగారాన్ని బ్యాంకులో జమ చేయాలి. ఒకవేళ ఖాతాదారులు స్పందించకపోతే, తమ సొమ్మును రాబట్టుకునేందుకు బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఉంది. దీనికి తోడు, గడువు ముగిశాక అసలు, వడ్డీ ఒకేసారి కట్టే బుల్లెట్ రీపేమెంట్ రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు కఠినతరం చేయడంతో ఆర్థిక సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ మార్పులు మార్కెట్‌లో ఒక రకమైన కలకలం సృష్టించాయి.

బంగారం ధరలు ఇంతలా పడిపోవడానికి అంతర్జాతీయ కారణాలే ప్రధానమని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే సూచనలు కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. డాలర్ విలువ బలపడడం, స్టాక్ మార్కెట్ల వైపు నిధులు మళ్లడం పసిడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 14 నెలల కనిష్టానికి చేరడం, దేశీయంగా రూపాయి బలపడడం కూడా ధరల పతనానికి దోహదపడ్డాయి.

ఇది కూడా చదవండి: Term Insurance: రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? కుటుంబానికి ఎంత బీమా అవసరం? కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత దిగొచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువ తగ్గేవరకు పసిడి ధరలు కోలుకోవడం కష్టమని భావిస్తున్నారు. అయితే, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులలో ఏవైనా భారీ మార్పులు వస్తే మాత్రం బంగారం, వెండి ధరలు పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, ధరలు తగ్గడం తాత్కాలికమేనని, మళ్లీ బులియన్ బుల్లెట్ లా దూసుకుపోవడం ఖాయమన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పతనం గోల్డ్ లోన్ రుణగ్రహీతలను మరింత భయపెడుతోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో 43 ఏళ్ల నాటి ఆర్ఏసీ నిబంధన రద్దు కానుంది! ఇకపై పూర్తి ఛార్జీ చెల్లించినా సీటు లభించదా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us