AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను: మురళి మోహన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత నటుడిగా అలరించారు మురళీమోహన్. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన.. ఆ తర్వాత నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. అటు ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయాలను ఎప్పుడూ పలు ఇంటర్వ్యూలలో పంచుకునే ఆయన.. ఇటీవల తన సంపాదన, మనీ సేవింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆ హీరో వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను: మురళి మోహన్
Actor Murali Mohan
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2026 | 12:13 PM

Share

ప్రముఖ సినీ నటుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మురళి మోహన్ తన కెరీర్‌లో ఒక కీలక మలుపు గురించి ఓ ప్రత్యేక కార్యక్రమంలో పంచుకున్నారు. మురళీ మోహన్ తన సుదీర్ఘ కెరీర్‌లో సినిమా, వ్యాపారం, రాజకీయ రంగాల గురించి ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ మూడింటిలో తనకు వ్యాపార రంగమే అత్యంత ఇష్టమైనదని, అందులోనే తాను అనుకున్న లక్ష్యాలను సాధించానని స్పష్టం చేశారు. అయితే సినిమా రంగంలో నటుడు కావడం అదృష్టంగా భావిస్తున్నానని, అది పూర్వజన్మలో చేసిన పుణ్యం లాంటిదని ఆయన చెప్పారు. వ్యాపారవేత్తను తమ చుట్టూ ఉన్న కొద్ది మంది మాత్రమే గుర్తిస్తే, సినిమా నటుడిని మాత్రం ఎక్కడికెళ్లినా అందరూ ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని మురళీ మోహన్ వివరించారు.

ఆ స్టార్ హీరో నా ప్రాణాలు కాపాడారు.. లేకపోతే అయిపోయేవాడిని! షాకింగ్ విషయం చెప్పిన సత్యప్రకాష్

వ్యవసాయ పంపుసెట్ల వ్యాపారంలో బిజీగా ఉన్న తనకు, సినీ రంగ ప్రవేశానికి దివంగత నటుడు శోభన్ బాబే ఆద్యుడని మురళీ మోహన్ వెల్లడించారు. మురళి మోహన్ ఇంకా సినిమాల్లోకి రాకముందు, క్రాంతి కుమార్ నిర్మాణంలో కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శారద సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరిగింది. ఆ సమయంలో తాను వీకెండ్స్ లో సినిమా సెట్స్ కు వెళ్లి శోభన్ బాబుతో గడిపేవాడినని మురళి మోహన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు శోభన్ బాబు తనను ఉద్దేశించి, “మురళి మీ పర్సనాలిటీ బాగుంది, మీరు కూడా సినిమాల్లోకి రావచ్చు కదా” అని సలహా ఇచ్చారని తెలిపారు.

ఆ రెండు సంఘటనలు జీవితంలో మర్చిపోలేను.. భయంతో చెమటలు పట్టాయి : సుబ్బరాజ్

ఆ సలహా విని, అప్పట్లో తాను వ్యాపారంలో బిజీగా ఉన్నానని, వాటిని వదులుకొని రాలేనని చెప్పినట్లు మురళి మోహన్ పేర్కొన్నారు. అయితే, శోభన్ బాబు ఇచ్చిన ఆ మాటలే తన సినీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చాయని, తదనంతర కాలంలో తాను సినిమాల్లోకి రావడానికి మార్గం వేశాయని ఆయన వివరించారు. ఈ మాటలే మురళి మోహన్ జీవితంలో ఒక కీలక ఘట్టంగా నిలిచిందని మురళీ మోహన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్నా.. కానీ అమ్మవారి దయతో ఊహించనిది జరిగింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us