AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే.. అసలు విషయం చెప్పిన నాజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ చిత్రాలలో అతడు ఒకటి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ టెలివిజన్‌లో ప్రసారం అయితే ప్రేక్షకులు కళ్ళప్పగించి చూస్తుంటారు. కథ, కథనం, సంభాషణలు, భావోద్వేగాలు, హాస్యం, యాక్షన్ వంటి ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే.. అసలు విషయం చెప్పిన నాజర్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 12:37 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయంతెలిసిందే .ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సోను సూద్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. జై బేరి ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం 2005లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందింది. అయితే ఈ సినిమాలో చాలా మందికి తెలియని ఓ ఆసక్తికరమైన విషయం గురించి  సీనియర్ నటుడు నాజర్ వెల్లడించారు. ముఖ్యంగా తన పాత్ర అంతగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవడానికి గల అసలు కారణం ఏమిటో ఆయన వివరించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాజర్, అతడు సినిమా తన సినీ జీవితంలో ఎంతో గర్వంగా చెప్పుకునే చిత్రం అని అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన పాత్రకు మొదట తనను కాకుండా సీనియర్ హీరో శోభన్ బాబును అనుకున్నారని, తనకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదని చెప్పారు. ఈ విషయం ఇప్పుడు తెలుసుకొని ఆశ్చర్యపోయానని, చివరికి ఆ అవకాశం తనకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కథ విన్నప్పుడే ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా అనిపించిందని, సాధారణంగా కనిపించే పాత్రలా కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉండేలా నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అదే ఆ పాత్రకు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తీసుకొచ్చిందని నాజర్ అన్నారు.

ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి

అయితే ఈ పాత్రకు సంబంధించిన అసలు విశేషం డబ్బింగ్ సమయంలో జరిగిందని నాజర్ గుర్తు చేసుకున్నారు. సాధారణంగా తాను నటించే అన్ని సినిమాలకు తనే సొంతంగా డబ్బింగ్ చెబుతానని, కానీ అతడు సినిమాకు మాత్రం అలా జరగలేదని వివరించారు. దర్శకుడు త్రివిక్రమ్ కు ఈ పాత్రకు మరింత బలమైన, హుందాగా వినిపించే గొంతు కావాలని అనిపించిందట. అందుకే ఆయన నేరుగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను కలిసి డబ్బింగ్ చెప్పాలని కోరారట. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం మొదట ఆ అభ్యర్థనను తిరస్కరించారని నాజర్ తెలిపారు. ఎందుకంటే కమల్ హాసన్‌తో ఆయనకు ఎంతో సన్నిహిత అనుబంధం ఉండేదని, కమల్ హాసన్ నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయితే దాదాపు అన్నిటికీ తానే డబ్బింగ్ చెప్పేవారని, తన గొంతును ఇతర నటులకు ఇవ్వడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండేది కాదని వివరించారు. అయినా త్రివిక్రమ్ వెనక్కి తగ్గలేదట. మరోసారి ఎస్పీ బాలసుబ్రమణ్యం వద్దకు వెళ్లి ఒకసారి నాజర్ గారి నటన చూడండి సర్, నచ్చితే మాత్రమే డబ్బింగ్ చెప్పండి అని కోరారట. ఆ మాటతో సినిమా చూసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం, నాజర్ నటనకు ఫిదా అయిపోయారట అని అంగీకరించారని నాజర్ చెప్పారు. ఇక ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అని ఆయన భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు.

Mahesh Babu: వార్ని.. మహేష్‌తో ఉన్న ఈ అమ్మాయి ఆ హీరోయినా.! ఎంత మారిపోయింది గురూ !!

నాజర్ మాట్లాడుతూ, “నేను ఆ పాత్రకు 60శాతం మాత్రమే జీవం పోసి ఉంటే, మిగిలిన 40 శాతం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గొంతు ఆ పాత్రకు ప్రాణం పోసింది. ఆయన డబ్బింగ్ వల్లే నా పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో మరింత బలంగా నిలిచిపోయింది” అని అన్నారు. ఒక గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి తన నటనను మెచ్చుకొని డబ్బింగ్ చెప్పడం జీవితంలో దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు. నేడు ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఇచ్చిన ఆ జ్ఞాపకం జీవితాంతం తనతోనే ఉంటుందని చెప్పారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కూడా నాజర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ కేవలం దర్శకుడు మాత్రమే కాదని, అద్భుతమైన రచయిత అని ప్రశంసించారు. ఒక పేజీ మొత్తం చెప్పాల్సిన విషయాన్ని రెండు వాక్యాల్లోనే చెప్పగలిగే అసాధారణ ప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. ఇక ప్రతి పాత్రకు సరిపోయే మాటలు, సరైన భావోద్వేగాలు ఎలా ఉండాలో త్రివిక్రమ్‌కు బాగా తెలుసని అన్నారు. అతడు సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవడానికి కథ, నటన, సంభాషణలతో పాటు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ప్రధాన కారణమని నాజర్ వెల్లడించారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ టెలివిజన్లో వచ్చిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తూ, కాలం గడిచే కొద్దీ దాని విలువ మరింత పెరుగుతూనే ఉందని సినీ అభిమానులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆయన సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య
గిరిబాబు చిన్న కుమారుడు తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడేమో..
గిరిబాబు చిన్న కుమారుడు తెలుగులో ఫేమస్ హీరో.. కానీ ఇప్పుడేమో..
ఆ పాట పాడేటప్పుడు భయమేసింది.. ఎవరైనా వచ్చి తిడతారేమో
ఆ పాట పాడేటప్పుడు భయమేసింది.. ఎవరైనా వచ్చి తిడతారేమో
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
మంజీరా నీళ్లు బంద్! సైబరాబాద్‌లో ఏం జరగబోతోంది?
మంజీరా నీళ్లు బంద్! సైబరాబాద్‌లో ఏం జరగబోతోంది?
పుష్ప సినిమాకు మించిన స్కెచ్‌.. మామూలుగా లేదుగా!
పుష్ప సినిమాకు మించిన స్కెచ్‌.. మామూలుగా లేదుగా!