AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు.. దెబ్బకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తన సినీ ప్రస్థానంలోని కొన్ని ఆసక్తికరమైన, కొన్ని షాకింగ్ విషయాలను ఇటీవల పంచుకున్నారు. అలాగే రాజమౌళి సినిమాల వివరాలు, ఆయన పని తీరు పై పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. అలాగే ఓ విలన్ గురించి కూడా తెలిపారు.

ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు.. దెబ్బకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి
Rajeev Kanakala
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2026 | 7:30 PM

Share

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పనితీరు గురించి, ముఖ్యంగా ఆయన నటుల నుంచి అద్భుతమైన నటనను ఎలా రాబడతారో వివరించారు. ఈ ఇకంటర్వ్యూలో, తన తల్లి టీచింగ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుతూ, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప నటుల గురించి తరచుగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారి గురువు పట్ల గౌరవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిరంజీవి తన కొత్త ఇంటికి గురువును ఆహ్వానించి, ఇంటిని చూపించి, భోజనం పెట్టి పంపించిన గొప్ప సన్నివేశాన్ని రాజీవ్ కనకాల వివరించారు. ఇది గురువు పట్ల గౌరవం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ఆ తరువాత, రాజీవ్ కనకాల తన సై సినిమా అనుభవం గురించి పంచుకున్నారు. మొదట రాజమౌళి సై సినిమాలో కేవలం రెండు సీన్లు మాత్రమే ఉన్నాయని చెప్పినప్పుడు, స్టూడెంట్ నెంబర్ 1 వంటి సినిమాలో నటించిన తనకు రెండు సీన్లేనా అని సందేహించినట్లు తెలిపారు. అయితే, రాజమౌళి పట్టుబట్టి పాత్రను వివరించాక, అవి చాలా కీలకమైన సీన్లు అని అర్థమైందని, అవి తన నటనను ప్రూవ్ చేసుకోవడానికి సరిపోతాయని రాజమౌళి అన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కోచ్ పాత్ర ప్రాముఖ్యతను, ఆ పాత్ర తన మీద మోపే బాధ్యతను రాజీవ్ కనకాల వివరించారు.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

అయితే ఈ చర్చలో కీలకమైన అంశం ప్రదీప్ సింగ్ రావత్ గురించే. సై సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర, దాని తర్వాత ఆయన కెరీర్‌లో వచ్చిన మార్పు గురించి రాజీవ్ కనకాల ప్రస్తావించారు. ప్రదీప్ రావత్ రాజమౌళి దర్శకత్వంలో సై చేసిన తర్వాత సౌత్ ఇండియా అంతటా ఒక పేరున్న నటుడిగా మారారని, ఆ తరువాత నార్త్ ఇండియాలో కూడా ఆయనకు మంచి అవకాశాలు వచ్చాయని రాజీవ్ కనకాల అన్నారు. ప్రదీప్ రావత్ స్వయంగా రాజీవ్ కనకాలతో మాట్లాడుతూ, “రాజాభాయ్, ఇత్నే సాల్ సే మై హిందీ ఇండస్ట్రీ మే థా. ముజే కోయీ భీ పెహచానా నహీ. కోయీ భీ అచ్ఛా రోల్ నహీ దియా. ఏక్, ఏక్ డైలాగ్, టుకుడే టుకుడే దేతే థే. అబ్ దేఖో రాజమౌళి సాబ్ తో ఇత్నా బడా ఏరియా. ఏ హిట్ హోగా నా రాజాభాయ్? నామ్ ఆయేగా నా?” అని అడిగినట్లు రాజీవ్ కనకాల గుర్తు చేసుకున్నారు. “అరే ఆయేగా సాబ్, డోంట్ వర్రీ. ఆప్ పూరే సౌత్ కో ఆప్ లిపటేంగే” అని తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమా ప్రదీప్ రావత్‌కు ఎంత ఆనందాన్ని, గుర్తింపును ఇచ్చిందో ఈ మాటలు తెలియజేస్తాయని రాజీవ్ కనకాల అన్నారు.

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

రాజమౌళి దర్శకత్వ పటిమ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని, ఆయన ప్రతి నటుడికి, ముఖ్యంగా ప్రదీప్ రావత్ వంటి వారికి ప్రతి నిమిషం వివరంగా వివరిస్తారని కనకాల అన్నారు. ఒక తెలుగు నటుడికి భాష అర్థమవుతుంది కాబట్టి త్వరగా చేయగలడని, కానీ హిందీ నటుడికి అది అంత సులభం కాదని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. అయినా, రాజమౌళి నటుల నుంచి కావాల్సిన పర్‌ఫార్మెన్స్‌ను రాబడతారని, అవసరమైతే స్వయంగా చేసి చూపిస్తారని తెలిపారు. ఈ వివరమైన దర్శకత్వం వల్లే ప్రదీప్ రావత్‌కు సై తర్వాత అనేక మంచి అవకాశాలు వచ్చి, ఆయన కెరీర్‌కు మంచి మలుపు వచ్చిందని రాజీవ్ కనకాల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

Pradeep Rawat

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us