AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejaswini: బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ.. ఫస్ట్ మూవీ విశేషాలివేనా.. ఫ్యాన్స్‌కు పూనకాలే

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ రాణిస్తున్నారు బాలయ్య. ఓ వైపు రాజకీయాలతో బిజీగానే ఉంటూ.. సినిమాల పరంగానూ సత్తా చాటుతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలిచాయి.

Tejaswini: బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ.. ఫస్ట్ మూవీ విశేషాలివేనా.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Bbalakrishna, Tejaswini
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2026 | 2:55 PM

Share

నందమూరి కుటుంబం నుంచి మరో కొత్త వ్యక్తి సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ ఎంట్రీపై గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఆమెకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తేజస్విని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమె నటిగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలపై ఆసక్తి ఉన్న తేజస్విని.. ఓ విభిన్నమైన కథతో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన క్లాస్‌మేట్ భువన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఇదికూడా చదవండి : ఆ స్టార్ హీరోయిన్‌కు చాలా పొగరు.. పెద్ద హీరోలను కూడా లెక్క చేయదు: మారుతి

కొత్త తరహా కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంతో తేజస్విని నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమాలో హీరోగా అన్వేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు సింధూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడైన అన్వేష్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. మరోవైపు ప్రముఖ నటుడు బాబీ సింహా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఇదికూడా చదవండి :అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

నవంబర్ 23న విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కాలేజీలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర నటీనటుల వివరాలు వెలువడాల్సి ఉంది. మొత్తానికి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని భావించిన అభిమానులకు తేజస్విని నిర్మాతగా మారబోతున్నారనే వార్త సరికొత్త సర్‌ప్రైజ్‌గా మారింది. బాలకృష్ణ కుమార్తె తొలి నిర్మాణ ప్రయత్నం ఎలాంటి కథతో ఉండబోతోంది.? ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది.? అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీని పై పూర్తి క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి : అనవసరంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నా.. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా! నటి షాకింగ్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us