AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ఇదెక్కడి సినిమా రా మావ.! ఇలా ఉంది.. మెంటలెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. మిస్టరీ కథలు, ఊహించని ట్విస్ట్ లతో సాగే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరధం పడుతుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. థియేటర్స్ లో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.

OTT Movie : ఇదెక్కడి సినిమా రా మావ.! ఇలా ఉంది.. మెంటలెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2026 | 3:16 PM

Share

ఓటీటీల్లో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ఇంటిల్లిపాది సినిమాలు రిపీట్ మోడ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీల్లో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. తమిళ్‌లో తెరకెక్కిన ఈ క్రేజీ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు ఈ మూడు సినిమా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2025లో విడుదలైన తమిళ సినిమా ఇది. ఈ సినిమా డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. 2025 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. సినిమా నిడివి సుమారు 2 గంటలు. సినిమా కథ విషయానికొస్తే..

కథలో సీత అనే మహిళ ప్రధాన పాత్ర. ఆమె తన కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ నిజాయితీగా జీవించాలని కోరుకుంటుంది. కానీ ఆమె జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిణామాలు ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడతాయి. సీత భర్త ముత్తు ఒక లారీ కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి వెళ్తాడు. అయితే అతను తిరిగి రాకుండా మూడేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. దీంతో సీత తన అత్త అర్పుతమ్మతో కలిసి ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. ఈ సమయంలో సురులి అనే వ్యక్తి సీతపై ఆసక్తి పెంచుకుంటాడు. ఆ తర్వాత అతను ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. అయితే కథలో మరో కీలక మలుపు ఎదురవుతుంది. మూడేళ్ల తర్వాత ముత్తు తిరిగి రావడంతో సీత జీవితంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.

దొంగిలించిన డబ్బు, నమ్మకద్రోహం, ప్రతీకారం, వ్యక్తిగత సంబంధాల్లోని విభేదాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. సీత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది.? తన చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు ఉద్దేశాలను ఎలా తెలుసుకుంది.? చివరకు తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది.? అనేదే సినిమా కథ.. ఈ సినిమాలో సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు చూడకపోతే వెంటనే ఈ సినిమాను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us