AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా.. కానీ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి: పూరి జగన్నాథ్

దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు అలిల మధ్య ఉన్న స్నేహబంధం గురించి అలితో సరదాగా కార్యక్రమంలో అలి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరుత సినిమాలో అలి పాత్ర అసలు లేదని, ప్రజల అభ్యర్థన మేరకు పూరి జగన్నాథ్ ఆ పాత్రను సృష్టించారని వెల్లడించారు.

సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా.. కానీ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి: పూరి జగన్నాథ్
Puri Jaganath
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2026 | 8:02 PM

Share

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు అలీల స్నేహం తెలుగు చిత్రసీమలో ఎంతో ప్రత్యేకమైనది. ఆ మధ్య అలితో సరదాగా అనే ప్రముఖ టీవీ షోలో అలీ, పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధం, తమ సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పూరి జగన్నాథ్ కలవడం తన అదృష్టమని అలీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత కోసం పూరి జగన్నాథ్ డైలాగులు రాసేందుకు బ్యాంకాక్‌కు వెళ్తుండగా జరిగిన ఓ సంఘటనను అలీ వివరించారు. పూరి జగన్నాథ్ బ్యాంకాక్‌ వెళ్లే క్రమంలో, ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారి నుంచి సెక్యూరిటీ చెక్ చేసే సిబ్బంది వరకు, చివరికి విమానంలో ప్రయాణికులు సైతం, “చిరుతలో అలీ పాత్ర ఏంటి.?” అని పదే పదే అడిగారట. వాస్తవానికి అప్పటికి అలీ కోసం ఆ సినిమాలో ఎలాంటి పాత్ర రాయలేదని, అయితే ప్రజల నుంచి వస్తున్న అంచనాలను, ఆదరణను చూసిన పూరి జగన్నాథ్, “ఒడియమ్మ కొడతారేమో అలీ గురించి రాయకపోతే” అని వెంటనే ఫోన్ చేసి, అలీ డేట్లు తీసుకోమని చెప్పి, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను సృష్టించా అని పూరీ తెలిపారు.

చిరుత సినిమా విడుదలైన తర్వాత బ్యాంకాక్‌కు వెళ్ళినప్పుడల్లా తమని అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటారని పూరి జగన్నాథ్ చెప్పారు. “అందరూ అలీ మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. అందరిలో అలీ కనిపిస్తున్నాడు అక్కడ. అది సృష్టించింది పూరి జగన్నాధ్” అని అలీ అన్నారు. పూరి జగన్నాథ్ తన దర్శకత్వంలో సినిమాకు అలీ ధరించాల్సిన డ్రెస్సులు నచ్చకపోవడంతో, స్వయంగా తన పర్సు నుంచి 30,000 డాలర్లు ఇచ్చి, “నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు, అద్భుతంగా ఉండాలి, కొనుక్కొని రేపు షూటింగ్‌కి వేసుకొని రా” అని పంపించారని అలీ గుర్తు చేసుకున్నారు.

పూరి జగన్నాథ్ తమ స్నేహంలో జరిగిన ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నారు. ఒకానొక దశలో తనకు ఆస్తి, ఇల్లు అన్నీ పోయి, కుక్కలకు కూడా తిండి పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అలీ వచ్చి ఒక పెద్ద నెక్లెస్ ఇచ్చారని, “నువ్వు ఇది వేసుకో, నీకు మళ్ళీ అన్నీ వస్తాయి” అని చెప్పారని తెలిపారు. పూరి జగన్నాథ్ తాను దేవుడిని, సెంటిమెంట్లని నమ్మనప్పటికీ, అలీని నమ్మానని, దానిని తన భార్యకు ఇచ్చానని, ఆ తర్వాత అన్నీ తిరిగి వచ్చాయని పూరి జగన్నాథ్ అన్నారు. “లవ్ యూ భయ్యా” అంటూ అలీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us