సినిమా రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఇనయా అభిప్రాయపడ్డారు. అందుకే కెరీర్‌కు మరో ప్రత్యామ్నాయంగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దుబాయ్‌కు వెళ్లినప్పుడు స్నేహితుడి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకున్నానని వెల్లడించారు. ఇప్పటివరకు దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, సింగపూర్, మలేషియా వంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. అమెరికా, యూకే వంటి దేశాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. తన స్నేహాలు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని ఇనయా చెప్పారు. తన బాధలను ఇతరులతో పంచుకోవడం అంతగా నచ్చదని, ఎవరికైనా చెప్పుకుంటే తనలోనే ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరితో కలిసిపోతానని, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒంటరిగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని వివరించారు.