AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు నేనే చేయాల్సింది.. కానీ మిస్ అయ్యాను

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

Rajeev Rayala
|

Updated on: Nov 11, 2026 | 9:47 PM

Share
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనా.. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో కొన్ని మంచి అవకాశాలను మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను గుర్తుచేసుకున్న మీనా.. తాను మిస్ చేసుకున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

1 / 5
అక్కినేని నాగార్జున హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా'. ఈ సినిమాలో నటించే అవకాశం తొలుత మీనాకే వచ్చిందట. అయితే, ఆ సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ అవకాశాన్ని ఆమె అంగీకరించలేకపోయారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమా కోసం సుమారు 60 నుంచి 65 రోజుల డేట్స్ అడిగారని మీనా తెలిపారు. అప్పటికే ఇతర సినిమాలకు కమిట్‌మెంట్స్ ఉండటంతో అన్ని రోజులు కేటాయించడం తనకు సాధ్యం కాలేదని చెప్పారు. కేవలం 15 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగలనని చెప్పానని, ఒకసారి సినిమా ఒప్పుకున్నాక షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇతరులకు చెడ్డపేరు తీసుకురావడం తనకు ఇష్టం లేదని వివరించారు.

2 / 5
అందుకే ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే, సినిమా విడుదలైన తర్వాత చూసి చాలా బాధపడ్డానని మీనా తెలిపారు. అందులోని పాత్ర ఎంతో బాగుందని, అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నానని అనిపించిందని వెల్లడించారు. మీనా వదులుకున్న మరో అద్భుతమైన అవకాశం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'పడయప్ప'. తెలుగులో 'నరసింహ' పేరుతో విడుదలైన ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర కోసం తొలుత మీనాను సంప్రదించారట. కానీ కొన్ని కారణాలతో ఆమె ఆ పాత్రను చేయలేకపోయారు.

3 / 5
ఈ విషయంపై మీనా మాట్లాడుతూ.. తన తల్లి ఆ పాత్ర తనకు సరిపోదని అభిప్రాయపడినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పటికే రజనీకాంత్‌తో తనకు మంచి జోడీగా గుర్తింపు ఉందని, ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే నటించానని చెప్పారు. అలాంటి సమయంలో నీలాంబరి వంటి అహంకారం, ఆత్మవిశ్వాసం, పవర్‌ఫుల్ నేచర్ ఉన్న పాత్ర తన ఇమేజ్‌కు సరిపోదని తల్లి భావించారట. అయితే, నటిగా తనకు మాత్రం ఇలాంటి విభిన్నమైన పాత్ర చేయాలనే కోరిక ఉండేదని మీనా తెలిపారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో కూడా మరోసారి ఆలోచించి, సినిమాలోని సౌందర్య పాత్రను చేయమని అడిగినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. 

4 / 5
నీలాంబరి పాత్రను తాను చేసి ఉంటే ఆ క్యారెక్టర్ స్వభావం కొంత భిన్నంగా ఉండేదని, అంత హార్ష్‌గా కనిపించేది కాదని దర్శకుడు చెప్పిన విషయాన్ని కూడా మీనా గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. నీలాంబరి పాత్ర రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందని, ఆ తర్వాత 'బాహుబలి'లో శివగామి వంటి శక్తివంతమైన పాత్రకు కూడా ఆమెకు మంచి గుర్తింపు రావడానికి ఇలాంటి పాత్రలు పునాదిగా నిలిచాయని మీనా అభిప్రాయపడ్డారు. సినిమా చూసిన తర్వాత రమ్యకృష్ణకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.

5 / 5
Follow Us