దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు
ప్రముఖ నటుడు సునీల్ గతంలో అలీతో సరదాగా కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితంలోని మూడు కీలకమైన, మర్చిపోలేని సంఘటనలను పంచుకున్నారు. ఈ జ్ఞాపకాలు ఆయన జీవిత ప్రయాణంపై ఎంతగానో ప్రభావం చూపాయని వెల్లడించారు. అలాగే ఓ డైరెక్టర్ తనను రిజెక్ట్ చేశాడని ఆతర్వాత ఆయనే పిలిసి ఛాన్స్ ఇచ్చాడని తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు సునీల్, అలీతో సరదాగా కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సంఘటనను పంచుకున్నారు. సినీ రంగంలోకి ప్రవేశించే ముందు, ఒక చిన్న పాత్ర కోసం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేత రిజెక్షన్ గురైన సునీల్, అనూహ్యంగా అదే దర్శకుడి దర్శకత్వంలో 12 సంవత్సరాల తర్వాత హీరోగా మారి ఆర్జీవీతోనే సినిమా చేశారు. సునీల్ చెప్పిందని ప్రకారం ఇది రామ్ గోపాల్ వర్మ ప్రేమకథ సినిమా ఆడిషన్స్ సమయంలో జరిగిన సంఘటన. సినిమాలో హీరో పక్కన స్నేహితుడి పాత్ర కోసం ఆర్టిస్ట్ సెలెక్షన్ జరుగుతుందని తెలిసి, సునీల్ ఆడిషన్స్‌కు హాజరయ్యారట. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ స్వయంగా బాంబే నుండి వచ్చి నటీనటులను ఎంపిక చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరోయిన్‌కు చాలా పొగరు.. పెద్ద హీరోలను కూడా లెక్క చేయదు: మారుతి
దాదాపు 50 మంది ఆర్టిస్ట్ లు ఆడిషన్స్‌కు రాగా, సునీల్ కూడా వారిలో ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్లు కొందరిని ఎంపిక చేసి ఆర్జీవీ వద్దకు పంపారు.అయితే, సునీల్ విషయానికి వచ్చేసరికి, ఆర్జీవీ అతనిని చూసి “ఇతను టఫ్ గా ఉన్నాడు, మనిషి హైట్ సాలిడ్ గా ఉన్నాడు, కళ్ళు కూడా కొంచెం పెద్దవిగా ఉన్నాయి. సుమంత్ పక్కన సుమంత్‌ను కొట్టేసేలా ఉన్నాడు తప్ప, సుమంత్ ఫ్రెండ్ లా అనిపించట్లేదు” అని అన్నారట. ఈ మాటలు విన్న సునీల్ తీవ్ర నిరాశకు గురయ్యారట. ఆర్జీవీ తనని తిరస్కరించిన తర్వాత, ఎలాగైనా ఆ పాత్రను దక్కించుకోవాలనే పట్టుదలతో, తన లుక్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక నిమిషం గడువు అడిగి, బయటకు వెళ్లి, పొడవుగా కనిపించకుండా త్రెడ్ కట్టుకుని, హెయిర్‌స్టైల్ మార్చుకుని, మళ్లీ ఆర్జీవి వద్దకు వెళ్లి “సార్, ఇప్పుడు కామెడీగా ఉన్నానా.?” అని అడిగారట. అప్పుడు ఆర్జీవీ “ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నావ్” అని అన్నారట. ఈ రిజెక్షన్ సునీల్‌ను చాలా బాధించిందట.
ఇది కూడా చదవండి :అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య
ఆడిషన్స్ నుండి తిరిగి వచ్చేటప్పుడు, తన స్నేహితులతో, ముఖ్యంగా ఖయ్యూమ్‌తో, “మీరందరూ లక్కీ, బాగా చేయండి, ఆల్ ది బెస్ట్” అని చెప్పి వచ్చేశారట సునీల్. తనను తిరస్కరించిన ఆ సంఘటనను సునీల్ ఎప్పటికీ మర్చిపోలేకపోయారట. అయితే, విధి విచిత్రమైనది. సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత, రామ్ గోపాల్ వర్మ మళ్లీ సునీల్‌ను సంప్రదించారట. ఈసారి ఒక క్యారెక్టర్ రోల్ కోసం కాదు, తన కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు చిత్రానికి హీరోగా సునీల్‌ను ఎంచుకోవడానికి. ఈ అద్భుత అవకాశాన్ని విన్న సునీల్ ఆశ్చర్యపోయి, “అయ్యబాబోయ్ అదేంటండీ, మీతో చేయడం నా డ్రీమ్” అని ఆనందంగా ఒప్పుకున్నారట. “నాది ప్రతీది అలాగే.. ఎక్కడైతే నేను రిజెక్ట్ అవుతానో, అక్కడ డబల్ సక్సెస్ అవుతాను ఏంటో.” కాలేజ్ లో డ్రామా క్యారెక్టర్లు ఇవ్వనప్పుడు కూడా, “సార్, మీరు ఇక్కడ నాకు డ్రామాలో క్యారెక్టర్ ఇవ్వట్లేదు కదా, నాకు సినిమాల్లో వచ్చేస్తాయి చూడండి” అని చెప్పేవారట సునీల్.
ఇది కూడా చదవండి : అనవసరంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నా.. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా! నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




