AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu: పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్ నటుడు బాబు.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

జబర్దస్త్ బాబు.. ఇన్నాళ్లు బుల్లితెరపై కమెడియన్ గానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ ఇప్పుడు కేవలం మొదటి సిరీస్ ద్వారా దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఇటీవల అతడు తెరకెక్కించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Babu: పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్ నటుడు బాబు.. కాబోయే భార్య ఎవరో తెలుసా?
Babu
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2026 | 9:47 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ నటుడు, దర్శకుడు బాబు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన తన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై నటుడిగా కొనసాగుతూనే తనలోని దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టాడు. ఇటీవలే దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సిరీస్‌ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుని విజయవంతమైంది. దీంతో నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇలా ఓవైపు బుల్లితెరపై నటుడిగా, మరోవైపు దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

బాబు పెళ్లి వార్త ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆయనను పెళ్లాడబోయే అమ్మాయి ఎవరనే విషయంపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ బాబు కాబోయే భార్య ఎవరు.? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.? అనే వివరాల్లోకి వెళితే.. బాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అమూల్య. ఆమె మంచిర్యాల జిల్లాకు చెందిన యువతి. చదువులోనూ ప్రతిభ కనబరిచిన అమూల్య బీ ఫార్మసీ పూర్తి చేసింది. అయితే ఆమెకు కేవలం చదువు మాత్రమే కాకుండా మీడియా, సోషల్ మీడియా రంగాలపై కూడా మంచి ఆసక్తి ఉంది. ఈ ఆసక్తితోనే ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్స్ న్యూస్ యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియా వైపు అడుగులు వేసి తన ప్రతిభను నిరూపించుకుంది.

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

నటుడి నుంచి దర్శకుడిగా మారిన బాబు.. యూట్యూబ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అమూల్యను వివాహం చేసుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి పరిచయం, పెళ్లి ముహూర్తం, వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి జబర్దస్త్ బాబు పెళ్లి వార్త ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇవి కూడా చదవండి

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us