AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: వార్ని.. మహేష్‌తో ఉన్న ఈ అమ్మాయి ఆ హీరోయినా.! ఎంత మారిపోయింది గురూ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన మహేష్.. ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu: వార్ని.. మహేష్‌తో ఉన్న ఈ అమ్మాయి ఆ హీరోయినా.! ఎంత మారిపోయింది గురూ !!
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2026 | 4:42 PM

Share

రాజమౌళి దర్శకత్వంలో , మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘వారణాసి’ చిత్రం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్ హైప్ పెంచేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీని పై ఎలాంటి క్లారిటీ లేదు.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

ప్రస్తుతం మహేష్  వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు.. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కు సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో మహేష్ బాబు యంగ్ లుక్ లో కనిపిస్తుండగా.. పక్కనే మరో అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పైన ఫోటోలో మహేష్ పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్. ఆమె పేరు తారా శర్మ. ముంబై మోడల్.. బాలీవుడ్ హీరోయిన్.

ఇవి కూడా చదవండి

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

అప్పట్లో మహేష్ సరసన ఓ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యింది. కొన్నాళ్లు షూటింగ్ లో పాల్గొన్న ఆ బ్యూటీ.. అనుహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది. తారా శర్మ  ఓం జై జగదీష్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆమెకు మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. హిందీలో ఖోస్లా కా ఘోస్లా, పేజ్ 3, సాయా, మస్తీ చిత్రాల్లో నటించింది. నిజానికి తార సినీ రంగ ప్రవేశం మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో జరగాల్సింది. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో మరో ఆఫర్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందట. దాంతో ఆమె ప్లేస్ లోకి అందాల భామ ఆర్తీ అగర్వాల్ వచ్చింది. అలా తన ఫస్ట్ మూవీ మిస్ అయ్యిందంటూ గతంలో చెప్పుకొచ్చింది తార.

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us