హన్సిక తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుందా.?

20 November 2026

Rajeev Rayala 

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన హన్సిక.. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ వంటి హీరోలతో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

అందం, అభినయంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది.

తెలుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

అయితే కొంతకాలంగా హన్సిక సినిమాల జోరు తగ్గినట్లు కనిపిస్తోంది.పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమాల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది.

అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుందా? కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందా? అనే ఆసక్తి నెలకొంది.