AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dadasaheb Phalke Awards 2026: మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే! ఉత్తమ నటుడితో సహా పూర్తి విజేతల లిస్ట్ ఇదే

సినీ పరిశ్రమలో ప్రతిభకు పట్టం కట్టే అవార్డుల వేడుకల్లో మరోసారి బాలీవుడ్ సినిమాల సందడి కనిపించింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2026 విజేతల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' సినిమా అవార్డుల వేడుకలో సత్తా చాటింది.

Dadasaheb Phalke Awards 2026: మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే! ఉత్తమ నటుడితో సహా పూర్తి విజేతల లిస్ట్ ఇదే
Dadasaheb Phalke Awards
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2026 | 10:56 AM

Share

సినీ పరిశ్రమలో ప్రతిభకు పట్టం కట్టే అవార్డుల వేడుకల్లో మరోసారి బాలీవుడ్ సినిమాల సందడి కనిపించింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2026 విజేతల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు కీలక పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నాకు కూడా ఉత్తమ విలన్ అవార్డు దక్కింది. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాతో రిషబ్ శెట్టి, ‘హక్’ చిత్రంతో యామీ గౌతమ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘సయారా’ సినిమాతో అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలిచారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఎంపికైంది. ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ అవార్డును అందుకున్నారు.

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ధురంధర్ ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ విలన్ వంటి విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా ఆదిత్య ధర్‌కు దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు దక్కడం విశేషం. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార: చాప్టర్ 1’ విమర్శకుల ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. అదే విధంగా ‘హక్’ చిత్రంలో నటనకు యామీ గౌతమ్ విమర్శకుల ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక ‘సయారా’ సినిమాతో అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలవడంతో పాటు ఆ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌కు కూడా పలు అవార్డులు దక్కాయి.

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’కు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డు లభించింది. ఆర్యన్ ఖాన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ‘పాతాళ్ లోక్ 2’లో నటనకు జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ‘ఢిల్లీ క్రైమ్ 3’తో షెఫాలీ షా ఉత్తమ నటిగా, హుమా ఖురేషి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2026.. పూర్తి విజేతల లిస్ట్ ఒక్కసారి చూద్దాం.!

ఉత్తమ చిత్రం: ధురంధర్

ఉత్తమ నటుడు: రణ్‌వీర్ సింగ్ (ధురంధర్)

ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సయారా)

విమర్శకుల ఉత్తమ చిత్రం: కాంతార: చాప్టర్ 1

విమర్శకుల ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్ 1)

విమర్శకుల ఉత్తమ నటి: యామీ గౌతమ్ ధర్ (హక్)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ నిర్మాతలు: ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ (ధురంధర్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: అరవింద్ ఎస్. కశ్యప్ (కాంతార: చాప్టర్ 1)

ఉత్తమ కొరియోగ్రాఫర్: శాండీ మాస్టర్ (కూలీ – మోనికా)

ఉత్తమ స్క్రీన్‌ప్లే, సంభాషణలు: రేషు నాథ్ (హక్)

సహాయ పాత్రలో ఉత్తమ నటుడు: వినీత్ కుమార్ సింగ్ (ఛావా)

 విలన్ క్యాటగిరీ ఉత్తమ నటుడు: అక్షయ్ ఖన్నా (ధురంధర్)

హాస్య పాత్రలో ఉత్తమ నటుడు: రితేష్ దేశ్‌ముఖ్ (హౌస్‌ఫుల్ 5)

ఉత్తమ గేయ రచయిత: ఇర్షాద్ కామిల్ (సయారా టైటిల్ ట్రాక్)

ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: ఫహీమ్ అబ్దుల్లా (సయారా టైటిల్ ట్రాక్)

సంవత్సరపు కళాకారుడు: కరణ్ ఔజ్లా

సంవత్సరపు ఉత్తమ పాట: సయారా (సయారా)

సంవత్సరపు హాస్యనటుడు: సమయ్ రైనా

సంగీత రంగంలో విశేష సేవలు: ఇళయరాజా

సినీ పరిశ్రమకు విశేష సేవలు: కమల్ హాసన్

వెబ్ సిరీస్ విభాగం

ఉత్తమ వెబ్ సిరీస్: ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్

ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు: ఆర్యన్ ఖాన్ (ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్)

ఉత్తమ నటుడు: జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)

ఉత్తమ నటి: షెఫాలీ షా (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)

సహాయ పాత్రలో ఉత్తమ నటుడు: వినయ్ పాఠక్ (గ్రామ్ చికిత్సాలయ్)

ప్రతికూల పాత్రలో ఉత్తమ నటి: హుమా ఖురేషి (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)

టెలివిజన్ విభాగం

ఉత్తమ టెలివిజన్ సిరీస్: తారక్ మెహతా కా ఊల్టా చష్మా

ఉత్తమ టీవీ నటుడు: అమర్ ఉపాధ్యాయ్ (క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ 2)

ఉత్తమ టీవీ నటి: స్మృతి ఇరానీ (క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ 2)

అంతర్జాతీయ సినిమా విభాగం

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్ – ఫైర్ అండ్ యాష్

ఉత్తమ అంతర్జాతీయ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ అంతర్జాతీయ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ అంతర్జాతీయ నటి: జెస్సీ బక్లీ (హ్యామ్నెట్)

అంతర్జాతీయ కళాకారిణి: టేలర్ స్విఫ్ట్

ప్రపంచ సినిమా రంగానికి విశేష సేవలు: జేమ్స్ కామెరూన్

షార్ట్ ఫిల్మ్ విభాగం

ఉత్తమ షార్ట్ ఫిల్మ్: మాధురి – ఎండ్ ఈజ్ బిగినింగ్ (సయ్యద్ షాహిద్ ఖాన్)

మొదటి రన్నరప్: జహాన్: ది లాస్ట్ గిఫ్ట్ (రాహుల్ శెట్టి)

రెండో రన్నరప్: ఇన్ హాఫ్ (జార్జ్ మొరాయిస్)

మూడో రన్నరప్: టీ కొట్టు3 (సాయి హరిణి వసంత్)

Follow Us