AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“Huawei” సంచలనం.. ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే !

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విభిన్నమైన డిజైన్లు, సరికొత్త టెక్నాలజీతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రపంచంలోనే తొలి నాన్-ఫోల్డబుల్ వైడ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌గా ‘హువావే ఓస్టా ఓ1 ప్రో’ (Huawei OSTA O1 Pro)ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.

Huawei సంచలనం.. ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే !
Huawei
Korivi Jayakumar
|

Updated on: Nov 21, 2026 | 10:51 AM

Share

Huawei OSTA O1 Pro Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విభిన్నమైన డిజైన్లు, సరికొత్త టెక్నాలజీతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది Huawei. తాజాగా ఈ ప్రముఖ టెక్ దిగ్గజం మరో అద్భుతమైన ఫోన్‌తో టెక్ ప్రియుల ముందుకు తీసుకొచ్చింది. ఇన్నాళ్లు మనం చూసిన సాధారణ స్మార్ట్‌ఫోన్లకు పూర్తి భిన్నంగా.. తమ కొత్త ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మనం రోజూ వినియోగించే స్మార్ట్ ఫోన్స్ 5 అంగుళాల నుంచి 6.5 అంగుళాల వరకు డిస్ ప్లేతో పొడవుగా ఉంటాయి. కానీ Huawei మాత్రం ఈసారి వైడ్ స్క్రీన్ తో టెక్ మార్కెట్ లో సంచలనానికి తెరలేపింది.

కాగా ప్రపంచంలోనే తొలి నాన్-ఫోల్డబుల్ వైడ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌గా ‘హువావే ఓస్టా ఓ1 ప్రో’ (Huawei OSTA O1 Pro)ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. తమ కొత్త సబ్-బ్రాండ్ ‘ఓస్టా’ (OSTA) కింద విడుదలైన ఈ తొలి ఫోన్‌కు ఇప్పటికే చైనాలో ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. విభిన్నమైన స్క్రీన్ రేషియోతో పాటు ఇందులో భారీ బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లను కంపెనీ జోడించింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనేది ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పూర్తి ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

Huawei OSTA O1 Pro ఫీచర్స్..

డిస్‌ప్లే, డిజైన్..

ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్ ఆకృతి. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో ఉండే వైడ్ వ్యూ అనుభూతిని ఇందులో సాధారణ ఫ్లాట్ స్క్రీన్‌పైనే తీసుకొచ్చారు. ఇందులో 6.39 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9.5గా ఉండటంతో వీడియోలు చూడటానికి, మల్టీటాస్కింగ్‌కు చాలా అనువుగా ఉంటుంది. వెనుకవైపు హారిజాంటల్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌తో పాటు OSTA బ్రాండింగ్ లోగో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్:

పనితీరు విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు హువావే సొంతంగా రూపొందించిన శక్తివంతమైన ‘కిరిన్ 9030S’ (Kirin 9030S) చిప్‌సెట్‌ను ఇందులో వాడారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. ఇది సరికొత్త ‘హార్మొనీ ఓఎస్ 7 ఏఐ పయనీర్ ఎడిషన్’ (HarmonyOS 7 AI Pioneer Edition) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. సిస్టమ్ స్థాయిలోనే పలు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

కెమెరా సెటప్:

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం హువావే ఇందులో ప్రీమియం కెమెరా సెటప్‌ను ఇచ్చింది. వెనుకవైపు 1/1.28 అంగుళాల RYYB సెన్సార్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనికి తోడుగా 3.7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP RYYB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, సహజమైన రంగులను ఒడిసిపట్టేందుకు ప్రత్యేకంగా ‘రెడ్ మాపుల్’ (Red Maple) లెన్స్‌ను అందించారు. తక్కువ వెలుతురులోనూ, దూరపు దృశ్యాలను జూమ్ చేసినప్పుడూ స్పష్టమైన ఫొటోలు వచ్చేలా వీటిని రూపొందించారు.

బ్యాటరీ, ఛార్జింగ్:

మొబైల్‌ను ఎక్కువసేపు వినియోగించే వారి కోసం ఇందులో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని పొందుపరిచారు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందించింది.

వేరియంట్లు, ధరల వివరాలు:

12GB RAM + 256GB స్టోరేజ్: 5,499 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 76,500) 12GB RAM + 512GB స్టోరేజ్: 6,499 యువాన్లు (సుమారు రూ. 90,330) 16GB RAM + 512GB స్టోరేజ్: 7,299 యువాన్లు (సుమారు రూ. 1,01,458) 16GB RAM + 1TB స్టోరేజ్: 8,799 యువాన్లు (సుమారు రూ. 1,22,309) గా నిర్ణయించారు.

కలర్స్:

ఈ మోడల్ స్టారీ బ్లాక్ (Starry Black), నెబ్యులా వైట్ (Nebula White), స్టార్‌బర్స్ట్ పర్పుల్ (Starburst Purple) రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

Follow Us