AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GTA 6 గేమ్ కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్!

Rockstar Games’ GTA 6: ఒక వీడియో గేమ్ కోసం ఎంతవరకు వెళ్తారు? సెలవు పెట్టుకుంటారా? రాత్రంతా మేల్కొని ఆడతారా? కానీ స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వీటన్నింటికీ మించి ఆలోచించాడు. తనకు ఎంతో ఇష్టమైన GTA 6 గేమ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా ఏడు రోజుల పాటు ఆడేందుకు ఏకంగా భార్య, కూతురితో ఒప్పందం చేసుకున్నాడు. ఇంటి పనులు చేయమని అడగకుండా ఉండేందుకు వారికి రూ.8,500కు పైగా చెల్లించాడు. ఇప్పుడు ఈ గేమింగ్ లవర్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

GTA 6 గేమ్ కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్!
Gta 6 Fever Scottish Man Pays Wife And Daughter Rs 8500 For A Week Of Gaming
Sharada V
|

Updated on: Nov 20, 2026 | 6:41 PM

Share

Rockstar Games’ GTA 6: వీడియో గేమ్స్ ప్రపంచంలో GTA సిరీస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా GTA 5 విడుదలైన తర్వాత 13 ఏళ్లుగా అభిమానులు GTA 6 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గేమ్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు ఆడదామా? అని ఆశగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నవంబర్‌ 19న విడుదలైన గేమ్ కోసం కొందరు సెలవులు ప్లాన్ చేసుకుంటుంటే స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన గేమింగ్ ఆనందానికి కుటుంబ సభ్యులు అడ్డంకి కాకుండా ముందుగానే ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

భార్యకు, కూతురికి డబ్బులిచ్చి మరీ ఒప్పందం

స్కాట్లాండ్‌లోని న్యూటన్ స్టీవర్ట్‌కు చెందిన 38 ఏళ్ల సీన్ లిటిల్ పెయింటర్, డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. స్వయం ఉపాధి పొందుతున్న అతడికి GTA గేమ్ సిరీస్ అంటే విపరీతమైన ఇష్టం. GTA 6 విడుదలైన తర్వాత కనీసం వారం రోజులైనా పూర్తిగా గేమ్‌కే సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడే అతడికి అసలు సమస్య ఎదురైంది. ఇంట్లో ఉంటే కుక్కలను బయటకు తీసుకెళ్లాలి, భోజనం సిద్ధం చేయాలి, ఇంటి పనులు చేయాలి. ఏదో ఒక పని మీద భార్య, కూతురు పిలుస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ప్రశాంతంగా గేమ్ ఎలా ఆడతాడు? అందుకే తన భార్య నటాలీ, కూతురు షార్లెట్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఒప్పందం ప్రకారం ఏడు రోజుల పాటు ఇంటి పనులన్నీ వారే చూసుకోవాలి. తాను గేమ్ ఆడుతున్నప్పుడు పిలవకూడదు ఎలాంటి పనులు అప్పగించకూడదు. ఇందుకు ప్రతిఫలంగా భార్యకు 50 పౌండ్లు (రూ.6,127), కూతురికి 20 పౌండ్లు (రూ.2,451) చెల్లించాడు. అంటే ఇద్దరికీ కలిపి దాదాపు రూ.8,578 ఇచ్చాడు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి వారం ఇచ్చే మొత్తాన్ని 500 పౌండ్లకు (రూ.61,276) పెంచాడు.

గేమ్ ఆడుతుంటే పని చెప్పకూడదు

సీన్ లిటిల్ తన కుటుంబంతో చేసుకున్న ఒప్పందాన్ని ‘నాన్ ఇంటర్‌ఫియరెన్స్ కాంట్రాక్ట్’గా పిలుస్తున్నాడు. అంటే తన గేమింగ్ సమయానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదన్నమాట. ఇంటి పనులు చేయమని అడగకూడదు, ఎంతసేపు గేమ్ ఆడుతున్నావంటూ ప్రశ్నించకూడదని షరతులు పెట్టాడు. అంతటితో ఆగలేదు. గేమ్ ఆడుతున్న సమయంలో పాత్రలు కడగాల్సి రాకూడదని పేపర్ ప్లేట్లు కొనుగోలు చేశాడు. వాటిని వాడితే భోజనం తర్వాత పాత్రలు కడిగే పని ఉండదు కదా! ఇలా తన గేమింగ్‌కు అడ్డొచ్చే ప్రతి చిన్న సమస్యకు ముందుగానే పరిష్కారం వెతుక్కున్నాడు.

GTA 7 వచ్చేసరికి 51 ఏళ్లు!

సీన్‌ GTA సిరీస్‌లోని మొదటి గేమ్ ఆడాడు. 2013లో GTA 5 విడుదలయ్యే సమయానికి అతడి వయసు 20 ఏళ్లు. అప్పటి నుంచి కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నాడు. GTA 7 రావడానికి కూడా ఇంత సమయం పడితే అప్పటికి తనకు 51 ఏళ్లు వస్తాయని సరదాగా వ్యాఖ్యానించాడు. మనసులో మాత్రం తాను ఎప్పటికీ టీనేజర్‌నే అని చెప్పుకొచ్చాడు.

గేమింగ్ కోసం రోజుకు 13 గంటల పని!

వారం రోజుల పాటు గేమింగ్ కోసం సమయం కేటాయించడం అంత సులభంగా జరగలేదు. స్వయం ఉపాధిలో ఉన్న సీన్ తన పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం వీకెండ్స్‌లో పనిచేశాడు రోజుకు 13 గంటలు శ్రమించాడు. గేమ్ విడుదలయ్యే సమయానికి తనకు ఎలాంటి పని బాధ్యతలు మిగలకుండా చూసుకున్నాడు. ముందుగానే పనులు పూర్తి చేసుకుని, కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకుని, గేమింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. GTA 6 కోసం సీన్ చేసిన ఏర్పాట్లు చూస్తుంటే గేమ్‌పై అభిమానం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. వారం విముక్తి కోసం పక్కాగా ప్లాన్ చేసిన ఈ గేమర్ కథ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది!

Follow Us
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
ఈ "ఎలక్ట్రిక్ సైకిల్" ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు..
ఈ
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే
మతిమరుపు సమస్యలను తగ్గించడంలోనూ పఠనం తోడ్పాటు.. 
మతిమరుపు సమస్యలను తగ్గించడంలోనూ పఠనం తోడ్పాటు.. 
ప్రతిరోజూ ఒక్క స్పూన్ తింటే చాలు, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
ప్రతిరోజూ ఒక్క స్పూన్ తింటే చాలు, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
కిర్రాక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max.. లాంఛ్ అప్పుడే ?
కిర్రాక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max.. లాంఛ్ అప్పుడే ?
పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ బాబు.. వధువు ఎవరో తెలుసా? వీడియో
పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ బాబు.. వధువు ఎవరో తెలుసా? వీడియో
భారతీయ కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్!
భారతీయ కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్!