AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు తరాల చరిత్రకు సజీవ సాక్ష్యం.. పూర్వికుల వారసత్వ సంపదను రక్షిస్తున్న జిన్నూరు వాసి

ఆధునిక జీవన పరుగులో మనిషి తన మూలాలను, పూర్వీకుల ఆనవాళ్లను క్రమంగా మర్చిపోతున్నాడు. ఒకప్పుడు నిత్యజీవితంలో భాగమైన ఎన్నో అద్భుతమైన వస్తువులు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే, పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు మాత్రం ఈ మారుతున్న కాలానికి ఎదురీదుతూ తన పూర్వీకుల జ్ఞాపకాలకు ప్రాణం పోస్తున్నారు. తన నివాసాన్నే ఒక అరుదైన చారిత్రక వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్ది, గతానికి, వర్తమానానికి మధ్య ఒక బలమైన వారధిని నిర్మించారు.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 21, 2026 | 7:44 AM

Share
జిన్నూరులోని సత్యనారాయణ రాజు గృహంలో అడుగుపెడితే చాలు.. ఒకప్పటి రాజరికపు వైభవం, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఏడు తరాలుగా వంశపారంపర్యంగా సంక్రమించిన అరుదైన వస్తువులను ఆయన ఎంతో భక్తిశ్రద్ధలతో, కంటికి రెప్పలా భద్రపరుస్తున్నారు. ఇంట్లో కొలువుదీరిన ప్రతి వస్తువు వెనుక ఒక ఘనమైన చరిత్ర, పూర్వీకుల జీవన విధానం దాగి ఉంది. నాటి కాలపు నాజూకుతనాన్ని చాటిచెప్పే పందిరి మంచాలు, రాజసౌధాలను తలపించే పల్లకీలు, అద్భుతమైన హస్తకళా నగిషీలతో ఆకట్టుకునే భారీ చెక్క స్తంభాలు చూపరులను కట్టిపడేస్తాయి.

1 / 5
కేవలం పెద్ద వస్తువులే కాకుండా, అలనాటి దైనందిన జీవితంలో వినియోగించిన సూక్ష్మమైన వస్తువులను సైతం సత్యనారాయణ రాజు సేకరించి పదిలపరిచారు. పూర్వీకుల ఆరోగ్యకరమైన జీవనశైలికి అద్దం పట్టే రాగి, ఇత్తడి పాత్రలు, నాటి వంటగది సామగ్రి, వివిధ రకాల గృహోపకరణాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

2 / 5
వీటితో పాటు, నాటి ఫొటోగ్రఫీ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పాతకాలపు కెమెరాలు సైతం ఈ ఇంటి అలమరాల్లో కొలువుదీరాయి. ఒకప్పుడు నిత్యం వాడుకలో ఉండి, నేడు కనుమరుగైన ఈ సామగ్రిని చూస్తుంటే, మనం ఒక టైమ్ మెషీన్‌లో వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

3 / 5
పురాతన వస్తువుల పట్ల తనకున్న అమితమైన ఆసక్తితో సత్యనారాయణ రాజు వీటిని కేవలం ఇంటి అలంకరణ వస్తువులుగా మాత్రమే చూడటం లేదు. నేటి యువతకు, రేపటి తరాలకు మన పూర్వీకుల సంస్కృతి, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే విజ్ఞాన భాండాగారంగా వీటిని తీర్చిదిద్దారు.

4 / 5
కాలం ఎన్ని మలుపులు తిరిగినా, ఆధునికత ఎంతగా విస్తరించినా, మన వారసత్వ సంపదను కాపాడుకుంటే చరిత్ర ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఈ అపురూప ఇల్లు నిరూపిస్తోంది. నిన్నటి తరానికి మధుర జ్ఞాపకాలుగా, నేటి తరానికి వింతలుగా, రేపటి తరాలకు విలువైన చరిత్ర పాఠాలుగా నిలుస్తున్న ఈ ప్రదర్శనశాల స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది..

5 / 5
Follow Us