ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
Dwaraka Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. చినవెంకన్న ఆలయంలోనూ ఆన్‌లైన్ సేవలు
చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఆన్‌లైన్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్లు, ప్రసాదం, వసతి తదితర సేవలను డిజిటల్ విధానంలో పొందేందుకు ప్రత్యేక కౌంటర్లు, వాట్సాప్ మరియు ఏపీ టెంపుల్స్ యాప్ ద్వారా సౌకర్యాలు కల్పించారు.
- B Ravi Kumar
- Updated on: Dec 25, 2025
- 12:03 pm
Andhra: సొంత లాభం కొంతమానుకొని తోటివారికి సాయపడవోయ్ అంటే ఇదేనేమో
పది రూపాయలకే తిన్నంత బిర్యానీ అంటే బిర్యానీ దుకాణాల ముందు కనిపించే క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటిది పేదరికానికి చెందిన చిన్నారులు ఓ మాల్‌కి వెళ్లి అక్కడ తమకు నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకుని వాటిని తనవెంట తీసుకుని వెళ్లారు. అబ్బ.. వినడానికి ఎంతో బాగుంది కదా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో జరిగింది ఘటన.
- B Ravi Kumar
- Updated on: Dec 25, 2025
- 11:35 am
Andhra: అబ్బా.. వీటికి అంత సీన్ వుందా … వీటి పేరు ఏంటో తెలుసా..?
పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పండు నోని. భారతదేశంలోనే పెరిగే ఈ పండు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- B Ravi Kumar
- Updated on: Dec 24, 2025
- 8:05 pm
I4C Warning: ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అవును ఇది మేము చెబుతున్నది కాదు.. ఫోన్‌లలో పైరసీ సినిమాలు చూసే యూజర్స్‌కు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చేస్తున్న హెచ్చరిక. ఇలా పైరసీ సినిమాలను చూసే వారు భవిష్యత్తులో చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని ICCCC వార్నింగ్ ఇస్తోంది.
- B Ravi Kumar
- Updated on: Dec 23, 2025
- 11:55 am
అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ
ధనుర్మాసం శ్రీ వేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్ర మాసంలో భీమవరం జేపీ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి 160 కిలోల పసుపు కొమ్ములతో అద్భుత అలంకరణ చేశారు. భక్తులకు శుభం చేకూరుతుందని అర్చకులు తెలిపారు. లక్ష తులసి పూజ, గాజుల అలంకరణ, ముక్కోటి ఏకాదశి వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Dec 22, 2025
- 4:46 pm
చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!
భారతీయ మహిళలు ధరించే చీరలు సాంప్రదాయానికి నిదర్శణం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా, డిసెంబర్ 21 ఆదివారం రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఏ బి యెన్ & పి ఆర్ ఆర్ కళాశాలలో ఘనంగా ప్రపంచ చీరల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Dec 22, 2025
- 2:03 pm
Telangana: అయ బాబోయ్.. చూత్తేనే నోరూరిపోతుంది.. ఇలా చేస్తే కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా..
చికెన్ నుంచి చేపల వరకూ ఏ నాన్‌వెజ్ పచ్చడైనా అదిరిపోయే టేస్ట్ కావాలంటే భీమవరం పేరు తప్పక వినపడుతుంది. పండుగల వేళ ఇక్కడ స్పెషల్‌గా తయారయ్యే కొరమీను పచ్చడి కోసం విదేశాల నుంచే ఆర్డర్లు వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ..
- B Ravi Kumar
- Updated on: Dec 20, 2025
- 3:14 pm
Bhimavaram: భీమవరం మావుళ్లమ్మ మూలవిరాట్ దర్శనం 11 రోజులు నిలిపివేత
భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఈ నెల 17 నుంచి 28 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా గర్భాలయంలో శుద్ధి, అలంకరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 29న ఉదయం 10.30 గంటలకు కళాన్యాసం అనంతరం అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Dec 18, 2025
- 7:16 pm
హరిదాసుల సందడి మొదలైంది… వీరు ప్రతి ఇంటికి ఎందుకు వస్తారు..?
పవిత్రమైన "ధనుర్మాసం" ప్రారంభం అయ్యింది. ధనుర్మాసం ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో నెలరోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలది. హరిదాసులు "హరిలో రంగ హరి" అంటూ అక్షయపాత్రతో ఇంటింటికి తిరుగుతూ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ధనుర్మాసం ప్రారంభమవ్వగానే హరిదాసుల సందడి మొదలైనట్టే అయితే వీరు ధనుర్మాసంలోనే ఎందుకు వస్తారు.
- B Ravi Kumar
- Updated on: Dec 18, 2025
- 5:34 pm
Andhra: దొంగలించిన సొమ్ము రికవరీ చేసి వెంటనే బాధితుడికి ఇచ్చేయొచ్చు.. ఏలూరు పోలీసులు చేసిన పనికి
ఇంటి దొంగతనాలు జరిగితే పోయిన బంగారం, ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నావారు వాటి రికవరీ కోసం తీవ్ర ఇబ్బందులు పడతారు. దొంగ దొరకటానికి, అతడి నుంచి సొత్తు స్వాధీనం చేసుకోవటానికి సమయం పడుతుంది. ఒకవేళ సొత్తు దొరికినా అది బాధితుడికి అందాలంటే కోర్టు నుంచి తీసుకోవటం ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇలాంటి జంజాటాలకు ఇక సెలవు అంటున్నారు ఏలూరు పోలీసులు
- B Ravi Kumar
- Updated on: Dec 17, 2025
- 1:14 pm
Andhra: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. ప్రభుత్వ ఉద్యోగులంటే మోజు.. ఏం చేశారో తెలిస్తే బిత్తరపోతారు
అతనేం సాధారణ వ్యక్తికాదు . కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ కి ఆయన భయపడి పోయారు. ఇక అడిగినంత సమర్పించుకున్నారు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు.. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- B Ravi Kumar
- Updated on: Dec 17, 2025
- 12:52 pm
Kodi pandalu: అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది గాలిపటాలు, కోడి పందాలు, తెలంగాణలో గాలిపటాలు, ముగ్గుల పోటీలతో సందడి వాతావరణం నెలకొంటే.. అటు ఏపీలో మాత్రం కోడి పందాల బరిలో కనిపిస్తుంది. ఇక పండగకు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీలో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్దం అవుతున్నారు.
- B Ravi Kumar
- Updated on: Dec 16, 2025
- 2:51 pm