AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. పోలీస్‌ స్టేషన్‌లో ఆటోలకు బేడీలు వేసిన వైనం..అసలు సంగతేంటంటే..

తణుకు పోలీసులు సీజ్ చేసిన ఆటోలకు హ్యాండ్‌కఫ్స్ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేరస్తులకు వాడే బేడీలను వాహనాలకు ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా ఎవరూ తీసుకువెళ్లకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నప్పటికీ, ఇది హాస్యాస్పదంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల వినూత్న భద్రతా చర్యపై ప్రజలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. పోలీస్‌ స్టేషన్‌లో ఆటోలకు బేడీలు వేసిన వైనం..అసలు సంగతేంటంటే..
Seized Autos Handcuffed
B Ravi Kumar
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 2:15 PM

Share

ఏలూరు జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నేరస్తులు పారిపోకుండా హ్యాండ్ కప్స్ వేస్తారు పోలీసులు. జైలు లో ఉన్న రిమాండ్ ఖైదీలను కోర్ట్ కి తరలించే సమయంలో వారు పారిపోకుండా తీసుకునే చర్యల్లో ఇది ఒక భాగం. ఇక స్టేషన్ లో అయితే నేరుగా నేరస్తులను లాకప్ లో వేస్తారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆటో లకు హ్యాండ్ కప్స్ వేశారు. దీంతో చూసే వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా వాహనాలను చైన్ లు వేసి బిగించి వాటికి తాళాలు వేస్తారు. కానీ ఇక్కడ హ్యాండ్ కప్స్ వినియోగించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇవి అంధకారికంగా ఎవరూ తీసుకువెళ్లకుండా తీసుకున్న జాగ్రత్త లో భాగంగా హ్యాండ్ కప్స్ వినియోగించినా, విపయోగించకూడని వాటికి ఉపయోగించడం తో స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులు, బాధితులు హాస్యాస్పదంగా చర్చించుకుంటున్నారు. కొందరు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేయటం తో ఆటోలకు బేడీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

సాధారణంగా రైల్లో ప్రయాణించేపుడు ప్రయాణికులు వారి సామాన్ల భద్రత కోసం చైన్స్ తో బిగిస్తారు, పోలీస్ స్టేషన్ ప్రాంగణం లోనే వస్తువులకు భద్రత లేకుండా పోతుందా… అందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నా అంటూ పబ్లిష్ లో చర్చ జరుగుతుండగా సీజ్ చేసిన వాహనాలు భద్రంగా ఉంచటమే పోలీసుల ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ..
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ..
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..