AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dental Health: మీ దంతాలు తెల్లగా మెరవాలంటే ఇంట్లోనే ఈ టిప్స్ ట్రై చేయండి..! నవ్వితే, ముత్యాలు ఏరుకోవాల్సిందే..

రాత్రి బ్రష్ చేయకపోతే డిన్నర్‌లో తిన్న మటన్, చికెన్, పాలకూర వగైరా పళ్ల సంధుల్లో ఇరుక్కుపోయి, పళ్లు పాడైపోవడానికి కారణమవుతాయి. అంతేకాదు.. సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే, పళ్ళు పసుపుగా మారడం, దంత సమస్యలు, మలినజలుపు సమస్యలు రావచ్చు. అందుకే తెల్లదనాన్ని కాపాడుకోవడానికి, పళ్ళను తొముకోవటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవడం ముఖ్యం.

Dental Health: మీ దంతాలు తెల్లగా మెరవాలంటే ఇంట్లోనే ఈ టిప్స్ ట్రై చేయండి..! నవ్వితే, ముత్యాలు ఏరుకోవాల్సిందే..
Teeth Whitening
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2026 | 11:13 AM

Share

​డిప్రెషన్, జుట్టు రాలిపోవడం లాగానే పంటి నొప్పి సమస్య కూడా నేటి తరం ఎదుర్కొంటున్న చాలా కామన్ సమస్యగా మారింది. కానీ, కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అయితే మీ దంతాలను ఎక్కువ కాలం పాటు సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే బ్రెష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, రాత్రి పడుకునే ముందు కూడా పళ్లు మరోసారి క్లీన్ చేసుకోవడం అంతే ముఖ్యం. రాత్రి బ్రష్ చేయకపోతే డిన్నర్‌లో తిన్న మటన్, చికెన్, పాలకూర వగైరా పళ్ల సంధుల్లో ఇరుక్కుపోయి, పళ్లు పాడైపోవడానికి కారణమవుతాయి. అంతేకాదు.. సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే, పళ్ళు పసుపుగా మారడం, దంత సమస్యలు, మలినజలుపు సమస్యలు రావచ్చు. అందుకే తెల్లదనాన్ని కాపాడుకోవడానికి, పళ్ళను తొముకోవటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవడం ముఖ్యం.

తెల్లగా తళతళ మెరిసే దంతాలు కావాలని కోరుకునేవారు.. సరైన బ్రష్ ఎంచుకోవడం ముఖ్యం. మృదువైన బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఉపయోగించాలి. దాంతో దంత కవచానికి హాని కాకుండా, పళ్ళ పొరలోని ప్లాక్ ను తొలగించవచ్చు. హార్డ్ బ్రష్ ఎక్కువగా ఉపయోగిస్తే గమ్ సమస్యలు వచ్చి రక్తస్రావం కూడా రావచ్చు. పళ్ళను 45 డిగ్రీల కోణంలో ఉంచి, చిన్న, సర్క్యులర్ మోషన్స్‌లో బ్రష్ చేయాలి. ముందువైపుకు, వెనకవైపుకు, అలాగే దవడల పై భాగానీ శుభ్రం చేయాలి. ప్రతి పల్లును కనీసం 10–15 సెకన్లు బ్రష్ చేయడం మంచిది.

ఇక బ్రష్‌ చేయడం కోసం ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్ ఉపయోగించండి. ఇది కేవలం తెల్లదనాన్ని పెంచడమే కాకుండా, కాడ్‌ను మేన్‌టైన్ చేస్తుంది. అతి ఎక్కువ వైట్‌నింగ్ టూత్‌పేస్ట్స్ ఎక్కువగా వాడడం దంతానికి హాని చేస్తుంది. పంటి నొప్పితో బాధపడుతున్నవారు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ఓసారి బ్రెష్ చేసుకుంటే… మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అందుకే బ్రెషింగ్ విషయంలో సరైన పేస్ట్‌ను ఎంచుకోవడం చాలా బెటర్. తక్కువలో దొరుకుతుందని నాసిరకం టూత్ పేస్ట్ వాడితే పళ్లు, నోరు పాడవుతాయి. ప్రతిరోజు ఫ్లోస్ చేసి, మౌత్‌వాష్ తో కుల్చుకుంటే, దంత మలినం తగ్గి, శ్వాస తాజాగా ఉంటుంది. అదనంగా, ఆహారం, అలవాట్లు. కాఫీ, టీ, టొమాటో సాస్, సిగరెట్ ఎక్కువ వాడకండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తినడం, నీరు ఎక్కువగా తాగడం మీ దంతాలను తెల్లగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

టూత్ బ్రెష్ మీద పెట్టుకునే పేస్ట్ ఎంత ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. కనీసం పల్లీ గింజ పరిమాణంలో పేస్ట్ పెట్టుకుని బ్రెష్ చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పళ్లు తోమేటప్పుడు ఆతృత, వేగం, కంగారు అస్సలు పనికి రాదు. ఇలా చేస్తే బ్రెష్ చిగుళ్లకి తగిలి గాయం కావడమే కాకుండా భవిష్యత్తులో పళ్ల సమస్యలు వస్తాయి. ప్రతీ నెలా బ్రెష్ మారుస్తూ ఉండాలి, వీలుకాకపోతే కనీసం రెండు నెలలకో కొత్త బ్రెష్ వాడాలి. బ్రెష్ వెంట్రుకలు వంగిపోయినా, విరిగిపోయినా కొత్త టూత్ బ్రెష్ కొనాలి. ఈ అలవాట్లు రోజువారీ జీవనంలో అనుసరిస్తే, పళ్ళు గ్లో, తెల్లదనాన్ని సుదీర్ఘకాలం కాపాడుకోవచ్చు.

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us